అందరు మండల విద్యా అధికారులు (MEOs) మరియు ప్రధానోపాధ్యాయులు (HMs) - ప్రతిరోజూ LEAP యాప్ ద్వారా మధ్యాహ్న భోజన పథకం (MDM)ను పర్యవేక్షించవలసిందిగా ఆదేశించబడుచున్నారు.
ప్రధానోపాధ్యాయులు లీప్ app Login లో, ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు ఆహారాన్ని రుచి చూడుటకు ఒక ఉపాధ్యాయుని నామినేట్ చేయవచ్చు.
(HM Login → Governance → Mid Day Meals → MDM Daily Teacher Nomination)
పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితా ప్రదర్శించబడుతుంది. HM ఒక ఉపాధ్యాయుని ఎంపిక చేయవచ్చు.
నామినేట్ చేయబడిన ఉపాధ్యాయుడు ఆహారం రుచి చూసిన తరువాత MDM Daily Feedback module లో అభిప్రాయాన్ని సమర్పించాలి.
(Teacher Login → Governance → Mid Day Meals → MDM Daily Feedback)
ఉపాధ్యాయునికి ప్రశ్నావళి ప్రదర్శించబడుతుంది, దానిని పూరించి అభిప్రాయం ఇవ్వాలి.
Parents Feedback option కూడా Students Login లో అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు student PEN ID మరియు ఆధార్ నంబర్ తో లాగిన్ అయి మధ్యాహ్న భోజనంపై తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చు.
అందరు MEOలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయించవలసి, పర్యవేక్షణను నిరంతరం కొనసాగించవలసి ఉంటుంది.