గౌరవనీయులైన DEOలు, APCలు, AMOలు మరియు PM SHRI పాఠశాలల ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాళ్లకు నమస్కారం.
మన రాష్ట్రంలోని 935 PM SHRI పాఠశాలల ఉపాధ్యాయులకు యోగాపై సమగ్ర అవగాహన మరియు శిక్షణ కల్పించే నిమిత్తం, హైదరాబాద్ సమీపంలోని 'కన్హా శాంతి వనం' (Kanha Shanti Vanam) నందు 3 రోజుల ప్రత్యేక నివాస శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ అందజేయబడును.
*ఉపాధ్యాయులఎంపిక*
ప్రతి PM SHRI పాఠశాల నుండి తప్పనిసరిగా ఇద్దరు (02) ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరుకావాలి.
ప్రాధాన్యతా క్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET/PD) ని ఎంపిక చేయాలి.
పాఠశాలలో PET/PD లేని పక్షంలో, యోగాపై ఆసక్తి అవగాహన ఉన్న ఇతర ఉపాధ్యాయులను నామినేట్ చేయవచ్చు.
శిక్షణ తేదీలు & వేళలు:
శిక్షణా సమయం: అక్టోబర్ 5, 6 మరియు 7 తేదీలు.
హాజరు సమయం: ప్రతినిధులందరూ అక్టోబర్ 4వ తేదీ సాయంత్రంలోగా శిక్షణ వేదిక (Venue) కు చేరుకోవాలి.
గూగుల్ ఫారమ్ నమోదు:
ఎంపిక చేసిన ఉపాధ్యాయుల వివరాలను కింద పేర్కొన్న గూగుల్ ఫారమ్ లింక్ ద్వారా తక్షణమే నమోదు చేయగలరు:
🔗 https://sites.google.com/view/pmshriyoga-3days/yoga
*ముఖ్య గమనిక:*
సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు (DEOలు), సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు (APCలు), అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లు (AMOలు) మరియు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించి,
అర్హులైన ఉపాధ్యాయులను సకాలంలో నామినేట్ చేసి, శిక్షణకు హాజరయ్యేలా తగిన బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది.
ధన్యవాదాలతో,
స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ / సమగ్ర శిక్ష,
PM SHRI టీమ్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్.