అత్యవసర సూచనలు ----✍️
గౌరవ మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయునది..
గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష, అమరావతి వారి
ఆదేశాల మేరకు రెండు రోజుల్లో రాష్ట్ర మరియు జిల్లా ఆడిట్ టీములు ప్రతి మండలమును లో పర్యటించి
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కు సంబంధించిన సప్లై చేసిన అన్ని వివరములు తనిఖీ చేయడం జరుగుతుంది
2024-25 నుండి 2026-27 వరకు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి గ్రౌండ్ బ్యాలెన్స్ రికార్డ్ చేసి రాష్ట్ర కార్యాలయానికి అందజేయమని ఆదేశములు జారీ చేసి ఉన్నారు.. కనుక అందరూ కచ్చితంగా స్టాక్ రిజిస్టర్ నందు రిసీవ్డ్ క్వాంటిటీ,
డిస్ట్రిబ్యూటెడ్ క్వాంటిటీ,
బ్యాలెన్స్ వివరములు కచ్చితంగా స్టాక్ రిజిస్టర్ లో నందు ప్రతిది సంవత్సరం వారీగా నమోదు చేసి ఉండగలరు..
అలాగే గతంలో కొన్ని మండలాల వారు గ్రౌండ్ బ్యాలెన్స్ 2025- 26 నందు ఉన్నట్లు సర్టిఫై చేసిజిల్లా కార్యాలయం కు కూడా పంపి ఉన్నారు . వారు ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ గ్రౌండ్ బ్యాలెన్స్ ను మొదట పంపిణీ చేసి తర్వాత మాత్రమే ఈ సంవత్సరం కు సంబంధించిన సరఫరా ప్రారంభించవలసి ఉన్నది..
ఈ విషయం గమనించి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచగలరు.. అలాగే మండల స్థాయిలో ఎలాంటి రిమార్క్స్ రాకుండా చూసుకోగలరు..
గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు కనుక అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాము..
--Apc, సమగ్ర శిక్ష..