AP TET 2025--FAQ2*FREQUENTALY ASKED QUESTIONS
P TET 2025--FAQ2*
👉TET లో Qualify కావాలంటే ఎన్ని మార్కులు రావాలి?
📍Central TET 2025 &NCTE నోటిఫి కేషన్ 2011 ప్రకారము ఎగ్జామ్ లోMinimum60%(90మార్కులు )వచ్చిన వారు Qualify అవుతారు .కాని State Govts/Local bodies ఈ Qualifying Marks విషయములో SC/ST/BC/PBDs కు Concessions ఇవ్వవచ్చును.ఈ Provision ప్రకారము Reservation policy కు అనుగుణంగా OC/EWSలకు 60%,(90Msrks)BCలకు 50%(75 Marks),SC/ST/కనీసం 40% డిజెబిలిటీ ఉన్న PBDs కు 40%(60) వరకు క్వాలిఫై మార్కులు గా నిర్ణయిం చింది
👉 2025 TET Marks Memo కు ఎంతకాలము Validity ఉండును?
📍As per G..O Ms No 69 Edn dt 25.10 2021 ఈ TET Pass Certificate కు జీవితాంతము (Life Time )Validity ఉండును
👉Present Working post తో నిమిత్తం లేకుండా ఒకే సారి 1A&2A పరీక్షలు వ్రాయవచ్చా?
📍 వ్రాయవచ్చును
👉 Aided School s Teachers కు కూడా ఈ TET కంపల్సరీ నా?
📍Govt/LB/Mpl/Aided/గురుకులాల/Welfare dept/Unaided స్కూల్ లో పోస్టుతో నిమిత్తము లేకుండా 1నుండి 5 మరియు 1 నుండి 8 అలాగే 6 నుండి 8 బోధిస్తున్న "సబ్జెక్టు" ఉపాధ్యాయుల (SGT/LP/SA/PSHM అందరు TET లో క్వాలిఫై అవ్వాల్సిందే.
👉 వ్యాయామ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్ ,డ్రాయింగ్ టీచర్లు కూడా టెట్ లో క్వాలిఫై కావాలా?
📍Gazetted HMs,SA PD,P.ET,Drawing&Craft టీచర్లు TET లో Qualify "కానవసరము లేదు"
👉 TET లో 2 యేళ్ళ లోపు Qualify కాక పోతే ప్రమోషన్ ఇవ్వరా?
📍 ఈ విషయము పై AP Govt ఏ నిర్ణయం తీసుకోలేదు? TET G.O 36 లో కూడా ఈ విషయము పై గాని 2 యేళ్ళ లో క్వాలిఫై కాని వారిని తీసివేస్తామని గాని ఎక్కడాపేర్కొనలేదు.ఆందోళన పడనవస రము లేదు
👉Inservice Teachers TET G.O పై High courtకు వెళ్ళి వచ్చా?
📍Supreme Court తాజా తీర్పు నేపధ్యంలో Inservice Teachers కు TET PASS ను నిర్బంధం చేసే అంశం పై High Courts కూడా ఏమీ చేయలేవు. ఈ అంశం పై Union Govt/State Govt /Service Associations /Individuals అప్పీలు చేస్తే సమీక్ష చేసిNCTE /నిబంధనల్లో మార్పు /వెసులుబాటు/సడలింపు అవకాశము కేవలం Supreme Court కే ఉన్నది.క్రింది కోర్టులు ఏమీ చేయలేవు.లేదా పార్లమెంటు లో RTE Act కు సవరణ జరగాలి.RTE act2009 లో TET పాస్ అయిన వారే టీచర్లుగా నియమించాలనే ఉన్నది.అది Prospective Retrospective అనే అంశము లేదు
👉TET Exam ఎన్ని సార్లు వ్రాయవచ్చు?
📍 ఎన్ని సార్లైనా వ్రాసుకోవాలి
👉ఈ TET ఉపద్రవం నుండి రక్షించబడటానికి ప్రస్తుతం మనం ఏమీ చేయలేమా?
📍 కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడిని ఐక్యతతో తేవాలి. లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులకు RTE Act 2009 /NCTE Act 2010కు ముందు నియమితులైన Inservice Teachers కు 'TET PASS ' అనే నిబంధన నుండి పార్లమెంటు లో బిల్లు ఆమోదించుట /,ఆర్డినెన్సు ద్వారా మినహాయింపు కోసం ప్రాతినిధ్యాలు చేయటం. దీనికి సమాంతరంగా కనీసం 10000 మంది టీచర్ల తో ఢిల్లి జంతర్ మంతర్ లో భారీ ధర్నా చేయటం.
👉 ఎంత మంది టీచర్ల పై ఈ TET ప్రభావం ఉండును.
📍 లక్ష మంది Working Teachers ఈ TET గండం బారిన పడతారు