Diksha అకౌంట్ లను Merge చెయ్యడం - Single Sign On ( SSO ) - పూర్తి విధానం:
DIKSHAలో Merge Accounts చేసే విధానం గురించి వివరించబడిన SOP (Standard Operating Procedure):
✒️ DIKSHAలో accounts క్రింది మూడు విధాలుగా create చేసుకుంటాం:
1. Google Account ద్వారా sign in చేయడం
2. State System ద్వారా sign in చేయడం ( ఈ విధానం మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ దీక్ష యాప్ యూజర్స్ ఫాలో అవ్వాలి. )
3. First Time User Sign up ద్వారా
✒️ ఉదాహరణకు : ఒక టీచర్ Google లేదా self-signed account ద్వారా కోర్సు complete చేశారని అనుకుందాం. ఇప్పుడు అతను ఆ usage వివరాలు తన State Accountలో చూపించాలనుకుంటే, Merge Account feature ఉపయోగించవచ్చు.
✒️ Merge Account వలన:
రెండు accounts లోని usage details కలిపి చూపవచ్చు
వేరొక account ను DIKSHA records నుంచి delete చేయవచ్చు
✒️ గమనిక: Merge Account ప్రారంభించడమంటే, అది State systemలో valid active account నుంచే చేయాలి. దీక్ష యాప్ అప్డేట్ అవుతూ ఉండడం వలనే ప్రాసెస్ మారనూ వచ్చు, కొంత తేడా ఉండవచ్చు
✒️ Prerequisites:
మీరు DIKSHAలో register చేసిన valid email address / phone number మరియు దానికి సంబంధించిన password కావాలి.
✒️ Step-by-step Instructions:
1. Profile iconపై క్లిక్ చేయండి.
2. చూపబడే list నుండి Merge Account option ఎంచుకోండి.
3. Merge Account pop-up boxలో Merge క్లిక్ చేయండి – ఇది usage details కలిపి, రెండో account ను delete చేస్తుంది.
4. మీరు usage కలపదలచిన account కి చెందిన Email Address / Phone Number ఇవ్వండి లేదా Google Sign-in ఉపయోగించండి.
5. మీ password ఇవ్వండి.
6. Next పై క్లిక్ చేయండి.
7. OK క్లిక్ చేయండి.
✒️మీరు ఇచ్చిన email/phone DIKSHA records లో match అయితే, Account merge ప్రారంభమవుతుంది.
లేకపోతే, మీ email/phone details సరిచూసుకుని మళ్లీ ప్రయత్నించండి.
ఇంకా అవగాహన కావాలంటే screenshots చూడండి. దీక్ష యాప్ frequently update అవుతుంది కాబట్టి కొన్ని సార్లు server issues కూడా ఎదురవవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు.
All the best.
#DIKSHA