FLN శిక్షణా కార్యక్రమం నకు హాజరయ్యే NTR, కృష్ణా, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులకు సూచనలు
FLN శిక్షణా కార్యక్రమం నకు హాజరయ్యే NTR, కృష్ణా, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులకు సూచనలు
➡️ వేదిక :
YES-J Center for Excellence, Beside ALIET, ITI College Road, Andhra Lyoala College (5 Number Road), JaiPrakash Nagar, Vijayawada
గూగుల్ లోకేషన్ లింక్
➡️ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఉంటుంది కాబట్టి 6 రోజులకు అవసరమైన దుస్తులు, కప్పుకోవడానికి దుప్పటి తెచ్చుకోవాలి. శిక్షణా కేంద్రం లోనే మంచము, పరుపు, దిండు, బెడ్ షీట్ ఏర్పాటు చేయబడినవి.
➡️ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు నిపుణుల చేత యోగ మరియు ధ్యానం కార్యక్రమాలు నిర్వహించబడును. అందుకు అనుగుణంగా ఉండే దుస్తులను కూడా తెచ్చుకోవాలి.
➡️ మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయడమైనది.
➡️ అత్యవసరమైన మందులు వాడేవారు 6 రోజులకు సరిపోయేలాగా మందులను తెచ్చుకోవాలి.
➡️ బంగారు ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను వెంట తెచ్చుకోరాదు. అవసరమైనంత క్యాష్ మాత్రమే తెచ్చుకోవాలి. ఏవైనా విలువైన వస్తువులు మిస్ అయితే శిక్షణా కార్యక్రమం నిర్వాహకులు బాధ్యత వహించరు.
➡️ 6 రోజులు పూర్తిగా శిక్షణా కేంద్రం లోనే ఉండాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు.
➡️ శిక్షణా కార్యక్రమం జరిగే సమయం లో సెల్ ఫోన్లు అనుమతించబడవు. ఉపాధ్యాయులు సహకరించాలి.
-DSEO & APC, SS, NTR జిల్లా