• Home/
  • /
  • In-Service Teachers Special TET–2026

In-Service Teachers Special TET–2026

 *In-Service Teachers Special TET–2026*

 
 
*👉AP Special TET–2026కు సంబంధించి In-Service Teachers తరచుగా అడిగిన ప్రశ్నలకు అధికారులు విడుదల చేసిన FAQలలో పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.*
 
*👉 DSC–1998, DSC–2008 MTS ఉపాధ్యాయులు — ప్రస్తుతం నిర్దేశిత కేటగిరీల్లో MTSలో పనిచేస్తున్న అర్హులైన వారికి Special TET–2026 రాసే అవకాశం ఉంది.*
 
*👉 KGBV Contract Teachers — ప్రస్తుత నోటిఫికేషన్‌లో Special TET రాసేందుకు అవకాశం కల్పించలేదు.*
 
*👉 Headmasters — Special TET నుంచి ఎటువంటి మినహాయింపు లేదు.*
 
*👉2017కు ముందు TET అర్హత సాధించిన Language Teachers — అప్పటి TET విధానంలో ప్రత్యేక Language Paper లేనందున, మళ్లీ TET అర్హత సాధించాల్సిన అవసరం లేదని FAQలో స్పష్టం చేశారు.*
 
*👉దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు — CBT పరీక్ష కావడంతో తగిన కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అర్హత కలిగిన Scribeలను మాత్రమే కేటాయిస్తారు.*
 
*👉 తయారీ సమయం — Special TET నోటిఫికేషన్ 24-08-2026న జారీ కాగా, పరీక్షలు 11-10-2026 నుంచి ప్రారంభం కానున్నందున మొత్తం 48 రోజుల తయారీ సమయం అందుబాటులో ఉందని తెలిపారు.*
 
*👉Special Education Teachers — TET నుంచి మినహాయింపు లేదు.*
 
*👉 10వ తరగతి + Degreeతో SGTగా నియమితులైన ఉపాధ్యాయులు — TET Paper-1A నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేశారు.*
 
*👉 ప్రశ్నపత్రాల సిలబస్ — Paper-I, Paper-II ప్రశ్నలు నోటిఫికేషన్/Information Bulletinలో పేర్కొన్న నిర్దేశిత సిలబస్, పరీక్షా విధానం పరిధిలోనే రూపొందిస్తామని తెలిపారు.*
 
*👉SGT (Urdu) — Paper-I Aలో Language-Iగా Urdu ఎంచుకున్న అభ్యర్థులకు Language-I ప్రశ్నలు Urduలోనే ఉంటాయి. మిగిలిన అంశాలు సాధారణ SGT పరీక్షా విధానం ప్రకారమే ఉంటాయి.*