❒సమగ్ర శిక్ష – PRASHAST App 2.0 అమలుపై రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలు
తేదీ: 16-06-2026❒👆👆
================
ఉద్దేశ్యం: 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ PRASHAST App 2.0 ద్వారా 100% స్క్రీనింగ్ నిర్వహించడం.
➤ఈ యాప్ UDISE+ అనుసంధానించబడింది.
================
ముఖ్య ఆదేశాలు
=================
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు మరియు IERPలు PRASHAST App 2.0లో నమోదు చేసుకుని యాక్టివేట్ కావాలి
➤ ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహించాలి. ఎవరూ మిగిలిపోకూడదు
➤సాధారణ ఉపాధ్యాయులు Part-I Screening నిర్వహించాలి
అవసరమైన చోట ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు మరియు IERPలు Part-II Screening చేయాలి
➤ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి ప్రతి విద్యార్థి స్క్రీనింగ్ పూర్తయ్యేలా చూడాలి
➤ జిల్లాల వారీగా పురోగతిని నిరంతరం సమీక్షించి, వారానికొకసారి రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు పంపాలి
➤ప్రధానోపాధ్యాయుల లాగిన్ సృష్టి, యాక్టివేషన్
జూన్ – జూలై 2026
➤క్లాస్ టీచర్లు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల మ్యాపింగ్
ఆగస్టు 2026
➤ Part-I స్క్రీనింగ్ (సాధారణ ఉపాధ్యాయులు)
సెప్టెంబర్ 2026
➤Part-II స్క్రీనింగ్ (ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు)
అక్టోబర్ 2026
🫵Note:100% స్క్రీనింగ్ లక్ష్యం సాధించడంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది.
రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్