• Home/
  • /
  • UDISE PLUS Student Release Requests

UDISE PLUS Student Release Requests

 📢 అత్యవసర సమాచారం – UDISE PLUS Student Release Requests

 
జిల్లాలోని అందరు  DYEOs, MEOs, Headmasters, MIS & Computer Operators గారికి తెలియజేయునది ఏమనగా,
 
UDISE PLUS Enrolment ప్రక్రియలో భాగంగా విద్యార్థి ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నాడో అదే పాఠశాలలో UDISE PLUS లో నమోదు అయి ఉండాలి.
 
🔹 విద్యార్థి వేరే పాఠశాలకు మారినట్లయితే, గతంలో చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంటనే ఆ విద్యార్థిని Drop Box లో ఉంచాలి. తద్వారా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు Import Option ద్వారా విద్యార్థిని చేర్చుకోవచ్చు.
 
🔹 ఒకవేళ పూర్వపు పాఠశాల వారు విద్యార్థిని Drop చేయకపోతే, ప్రస్తుత పాఠశాల వారు Student Release Request Option ద్వారా Release Request పంపవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం Enable చేయబడింది.
 
🔹 పంపిన Release Request, పూర్వపు పాఠశాల UDISE PLUS Login లోని Release Request Module లో కనిపిస్తుంది.
 
⚠️ విద్యార్థిని Release చేయాలా లేదా Reject చేయాలా అనే అధికారం సంబంధిత Headmaster గారికే ఉంటుంది.
 
✅ అందరు ప్రధానోపాధ్యాయులు తమ UDISE PLUS Login ను ప్రతిరోజూ పరిశీలించి, వచ్చిన ప్రతి Request ను Approve లేదా Reject చేయాలి.
 
⚠️ ఒకవేళ 3 రోజులలోపు ఎటువంటి చర్య తీసుకోకపోతే, ఆ Request Mandal, District, State మరియు National Logins లో Escalate అవుతుంది.
 
🔹 Enrolment సక్రమీకరణ మరియు Dropouts నివారణలో భాగంగా Mandal/District స్థాయిలో పెండింగ్ Release Requests ను Clear చేయడం జరుగుతుంది.
 
🔹 Reject చేసిన Requests అన్నీ Destination Admin (Mandal Login) కు వెళ్తాయి. విద్యార్థి నిజంగా మీ పాఠశాలలోనే చదువుతున్నట్లయితే Reject చేసిన వెంటనే సంబంధిత Mandal MIS గారికి సమాచారం ఇవ్వాలి.
 
🔹 విద్యార్థి Request చేసిన పాఠశాలలోనే చదువుతున్నట్లు నిర్ధారణ అయితే, Mandal MIS గారు Release చేయడం జరుగుతుంది.
 
📌 కాబట్టి అందరు ప్రధానోపాధ్యాయులు తమ UDISE PLUS Login ను ప్రతిరోజూ పరిశీలించి, వచ్చిన ప్రతి Request పై 3 రోజులలోపు తప్పనిసరిగా స్పందించగలరు.
 
– IT CELL