'జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు - 2026' కొరకు అర్హులైన ఉపాధ్యాయుల నుండి ఆన్‌లైన్ లో దరఖాస్తులను చేసుకోవాలని తెలియజేయడమైనది . గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 10 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అర్హులు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అర్హులు కారు. దరఖాస్తులను తేదీ 16 జూన్ 2026 నుండి 13 జూలై, 2026 వరకు ఆన్‌లైన్ వెబ్ పోర్టల్
https://nationalawardstoteachers.education.gov.in/ ద్వారా మాత్రమే సమర్పించాలి. జిల్లా, రాష్ట్ర కమిటీల పరిశీలన అనంతరం, జాతీయ స్థాయి స్వతంత్ర జ్యూరీ తుది విజేతలను ఎంపిక చేస్తుంది. రాష్ట్రం లోని అర్హత గల ఉపాధ్యాయులు అందరు National Teachers Awards-2026 కి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ శ్రీమతి. తమీమ్ అన్సారీయ మేడమ్ గారు తెలియజేయడమైనది .
పాఠశాల విద్య కమిషనర్.
*సాధారణ పరిపాలన శాఖ (GAD )వారి సూచనల మేరకు EHRMS ఫార్మాట్ లో TIS డేటా ఆధారంగా జిల్లాల వారీగా జనరల్ సీనియారిటీ జాబితాలు విడుదల చేస్తున్నారు.*