SA - 1 పరీక్ష సమాచారం
SA - 1 పరీక్ష సమాచారం
1)Self-assessment term మోడల్ పేపర్ -I పేరు తో ఈ Summative -I పిలవ బడుతుంది.
2) జిల్లా వ్యాప్తంగా పేపర్ల ను మండల కేంద్రాలకు చేరవేయటం జరిగింది.
3)పేపర్ లను మండల కమిటీ (meo-School complex Hm/Gazetted HM,PS Hm) వెరిఫై చేసుకుని subject wise, trunk box లలో పెట్టి ఒక రిజిస్టర్ లో పేపర్ వివరాలు నమోదు చేయాలి.
4)Time table వచ్చిన పిదప పరీక్షకు ముందు రోజు elementary పాఠశాల పేపర్లను complex Hm లకు అందచేసి పరీక్షకు ముందు మాత్రమే ఏరోజు పేపర్లు ఆ రోజు elementary పాఠశాలకు seal cover లో అందు నట్లు చూడవలెను.
5)ఉన్నత పాఠశాలకు/ప్రైవేట్ పాఠశాలలకు పేపర్స్ ప్రతి రోజు 1గం.ముందు మాత్రమే MRC నుండి కమిటీ సమక్షం లో Authorised person కు అందచేయాలి.
6)సదరు distribution ను విధిగా రిజిస్టర్ నందు నమోదు చేయాలి.
7)పేపర్ shortage ని ముందుగానే గుర్తించి వెంటనే DCEB కి తేలియపరచాలి పరీక్షా ప్రారంభమైన పిదప shortage ని తెలియజేస్తే ఇబ్బందులు వస్తున్నాయి అందరూ గమనించగలరు.
8) SA Term.1 పేపర్ విషయంలో ఏ స్థాయిలో అయినా పేపర్ లీకేజీ జరిగితే అట్లు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోబడతాయి.పేపర్ పై కోడ్ ముద్రించ బడి ఉంటుంది.
9)మండల విద్యాశాఖ అదికారులు / ప్రధానఉపాధ్యాయులు ఈ సూచనలు పాటించి అత్యంత జాగ్రత్తగా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలి.
10)ప్రతి పరీక్ష ముగిసిన వెంటనే సంబంధిత సబ్జెక్ట్ టీచరు పేపరు వేల్యూషన్ ప్రారంభించి సకాలంలో దిద్ది పిల్లలతో analysis చేసి MARKS ని ONLINE లో UPLOAD చేయవలెను.
11) కావున పై విషయాలను అందరూ పాటించ వలసిందిగా తెలియజేయడమైనది.