• Home/
  • /
  • TET-2026 సమాచారం

TET-2026 సమాచారం

 TET-2026 సమాచారం

*▶️TET సమాచారం*
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)- జూన్ -2026 నిర్వహించడానికి 05.06.2026 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 05-07-2026. ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో ఏవైనా తప్పిదాలు చేసుకోని ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి అభ్యర్థులకు వన్ టైం డిలీట్ ఆప్షన్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు నింపే క్రమంలో ఏవైనా తప్పులు చేసుకోని ఉన్నట్లయితే https://csc.ap. gov.in,
 https://tet2dsc.apcfss.in  వెబ్సైట్ ద్వారా వన్ టైం డిలీట్ ఆప్షన్  ఉపయోగించుకొని సరైన వివరాలతో దరఖాస్తును నింపి తిరిగి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడినది. ఈ అవకాశం 02 .07.2026 తేదీ నుండి అందుబాటులోకి వస్తుంది. వన్ టైం డిలీట్ ఆప్షన్లో ఆధార్ నంబరు, ఫోన్ నెంబరు తప్ప మిగిలిన అన్ని అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. వన్ టైం డిలీట్ ఆప్షన్ వినియోగించుకుని తిరిగి దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఇది వరకు సమర్పించిన దరఖాస్తును డిలీట్ చేసి సరైన వివరాలు నింపి ఫైనల్ సబ్మిషన్ చేయాలి లేని ఎడల దరఖాస్తు చేసినట్లుగా పరిగణించబడదు ఆన్లైన్ దరఖాస్తులో సవరణలు అవసరమైన అభ్యర్థులు వన్ టైం డిలీట్ ఆప్షన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని చివరి తేదీ 05-07-2026 లోగా తిరిగి దరఖాస్తు చేసుకోవలసినదిగా ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం వెంకట కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
 
ఎం. వెంకట కృష్ణారెడ్డి కన్వీనర్, ఏపీ టెట్