• Home/
  • /
  • విద్యాశాఖలో మాన్యువల్ హాజరు రిజిస్టర్ల స్థానంలో పూర్తిగా LEAP App Facial Recognition System (FRS) ద్వారా డిజిటల్ హాజరు అమలు చేయడం.

విద్యాశాఖలో మాన్యువల్ హాజరు రిజిస్టర్ల స్థానంలో పూర్తిగా LEAP App Facial Recognition System (FRS) ద్వారా డిజిటల్ హాజరు అమలు చేయడం.

 విద్యాశాఖలో మాన్యువల్ హాజరు రిజిస్టర్ల స్థానంలో పూర్తిగా LEAP App Facial Recognition System (FRS) ద్వారా డిజిటల్ హాజరు అమలు చేయడం.

 
ముఖ్యాంశాలు:
LEAP App ద్వారా Facial Attendance మాత్రమే అధికారిక హాజరు.
 
ఇకపై ఉద్యోగులు ప్రతిరోజూ LEAP Appలోనే హాజరు నమోదు చేయాలి.
 
LEAP Appలో నమోదైన హాజరే అధికారిక రికార్డు.
 
మాన్యువల్ Attendance Registers ప్రాధాన్యం లేదు.
 
వ్యక్తిగత డైరీలు, ఆఫ్‌లైన్ అటెండెన్స్ షీట్లు, ఇతర మాన్యువల్ రికార్డులు అధికారికంగా పరిగణించబడవు.
 
ఆడిట్ లేదా అధికారిక నివేదికల కోసం కూడా ఇవి చెల్లవు.
 
అవసరమైతే
 
LEAP App నుండి వచ్చిన Attendance Report ను ప్రింట్ తీసి రిజిస్టర్‌లో అతికించవచ్చు.
 
జీతాల విషయంలో
 
Salary డ్రా చేయడానికి Duty Certificate అవసరం లేదని పేర్కొన్నారు (IERPs, CRPs, Part-time Instructors వంటి సంబంధిత సిబ్బందికి).
 
అన్ని సెలవులు
 
Casual Leave, Optional Holiday, Special Duty మొదలైనవి డిజిటల్ పోర్టల్ ద్వారానే అప్లై చేసి ఆమోదం పొందాలి.
 
హాజరు నమోదు చేయకపోతే
 
LEAP Appలో Attendance నమోదు చేయని రోజును Absent గా పరిగణిస్తారు.
 
అమలు తేదీ
 
ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.
 
ఈ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?
Head Masters
 
Teachers
 
MEOs
 
Dy.EOs
 
APC
 
IERPs
 
Cluster Resource Persons
 
DEO పరిధిలోని ఇతర సిబ్బంది
 
ఉపాధ్యాయులకు దీని అర్థం
ప్రతిరోజూ LEAP Appలో Facial Attendance తప్పనిసరిగా నమోదు చేయాలి.
 
సెలవులు కూడా App/Portal ద్వారానే అప్లై చేయాలి.
 
Appలో హాజరు నమోదు కాకపోతే ఆ రోజు Absent గా పరిగణించే అవకాశం ఉంది.
 
మాన్యువల్ హాజరు రిజిస్టర్ ఒక్కటే సరిపోదు; అధికారికంగా LEAP Attendanceకే ప్రాధాన్యం ఉంటుంది.