*📢 వేసవి సెలవుల్లో F.L.N కార్యాచరణ ప్రణాళిక*
*🚀24.4.2026 నుండి 10.6.2026 వరకు*
**వేసవి విద్యా వారధి :*
1. వేసవి సెలవుల్లో విద్యార్థులకు చదువుకోవాలనే భావన ముందుగా కలిగించడం.
2. ప్రతి విద్యార్థికి తమ పాఠశాలలో వేసవి తరగతులు నిర్వహిస్తామని తెలియజేయడం, వారి తల్లి దండ్రుల కు విద్యార్థులను పంపించమని సూచించడం.
3. ప్రతి గ్రామంలో పాఠశాలలో ఉదయం గం 8.00 నుండి 10.00 వరకు ప్రతి రోజూ వేసవి తరగతులు నిర్వహించడం.
4. సదరు తరగతులను ఆ గ్రామం లోని 10, ఇంటర్ ఆపైన చదువుకున్న స్టూడెంట్స్ లేదా రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిర్వహించినట్లు ముందుగానే ఏర్పాట్లు ఆ గ్రామ/ప్రాంత ఉపాధయునిచే ఏర్పాట్లు చేసుకోవడం.
5. ప్రతి విద్యార్థికి అతని తరగతి మరియు తరగతిలో అతని స్థాయిని బట్టి బోధన చేయడం.
6. తరగతిని బట్టి అభ్యసన సామర్థ్యం లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి మరింత సులువుగా వారు తమ తరగతి మేరకు సామర్థ్యాలు కు చేరువ చేయడం.
7. ప్రతి రోజూ విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం ఒక నీతికథ, పిట్టకథ లతో ప్రారంభించడం.
8. గ్రామస్థాయిలో పెద్దలు, SMC చైర్మన్, సభ్యులు ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని కోరడం.
9. పాఠశాల HM మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తమ గ్రామంలో వేసవి తరగతులు విజయవంతం చేసి ఫలితలుసాధనకు బాధ్యత వహించి కృషి చేయడం.
10. CRP/Village Edn secretary/ మహిళా పోలీసు వారు రోజూ ఒకరు చొప్పున సదరు తరగతులను సందర్శించి పరిశీలన చేయడం
11. రెండు/మూడు రోజులకొకసారి పాఠశాల HM మరియు ఉపాధ్యాయులు వంతుల వారీగా వేసవితరగతులను సందర్శించి పరిశీలన చేయడం
12. ప్రతి వారానికి ఒకసారి విద్యార్థులకు తేలికపాటి పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యం అంచనావేసి పరిశీలన చేయడం.
13. వారంతర పరీక్ష ఫలితం మేరకు విద్యార్థి యొక్క సామర్థ్యం అంచనా వేసి బోధనలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకొనుట.
14. ప్రతి 10 రోజులకు MEO 1 and 2 లు గారు ప్రతి వేసవి తరగతులు బోధనా కేంద్రాలను సందర్శించడం.
15. వేసవి విద్యా తరగతులనుం పూర్తిగా ఎటువంటి రుసుము ఆశించకుండా స్వచ్ఛందంగా నిర్వహించే వారిని మాత్రమే నియమించుకోవడం.
16. HM మరియు ఉపాధ్యాయులు కూడా నిర్బంధంగా అని భావించకుండా తమ వంతు సమాజ బాధ్యత గా భావించడం.
వేసవి తరగతులు ముఖ్యోద్దేశ్యం
'విద్యార్థి బట్టీ పట్టే విధానం పూర్తిగా నిరోధించాలి.
* ఆంగ్లం,తెలుగు లలో అక్షరాలను పదాలను వాక్యాలను గుర్తు పట్టి చదవడం చేయగలగాలి.
* పదాలు వాక్యాలు ఆలోచించి వ్రాయగలగాలి.
* చతుర్విద ప్రక్రియలు అంటే తెలుసుకోవాలి మరియు స్వంతంగా ఆలోచించి చేయగలగాలి. చేసిన ప్రక్రియ వివరించగలగాలి.
* తన తరగతి కి తగిన అభ్యాసన సామర్థ్యం తప్పకుండా కలిగి ఉండే విధంగా విద్యార్థిని తయారుచేయడం.
* విద్యార్థి అంతవరకు నేర్చుకున్న చదువు మరిచిపోకుండా చేయడం.