*💥ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ - ఉపాధ్యాయుల కేటాయింపు*
1) మీ మండల పరిధిలో పాఠశాలల యందు మంజూరు కాబడిన ఉపాధ్యాయుల పోస్టుల వివరాలు మరియు పనిచేయుచున్న వారి వివరాలు ఇవ్వబడినవి.
2) ఈ వివరాలను NIDHI PORTAL సమాచారంతో సరిచూసుకోవలెను. మండలం లోని ప్రతి DDO నుండి NIDHI Portal నుండి డౌన్లోడ్ చేసిన కాపీతో సరిచూసుకోవాలి
3) పైన తెలుపబడిన ఉపాధ్యాయులు కాక మరి ఏ ఇతర ఉపాధ్యాయులు అదనంగా లేరని లేదా ఉంటే వారి వివరాలను ధృవీకరించాలి
4) అలాగే సదరు పాఠశాలల నుండి ఉపాధ్యాయులు ఇదివరలో Long Leave / Abroad (more than 1 year), Under Suspension, Study Leave, Unauthorized Absence, Employee Abscoded, Employee Missing etc. ఉన్నవా లేవా అనే విషయాన్ని ధృవీకరించాలి
5) ప్రస్తుతం Long Leave / Abroad (more than 1 year), Under Suspension, Study Leave, Unauthorized Absence, Employee Abscoded, Employee Missing etc. లో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు కూడా వారు ఏ పాఠశాల నుండి Long Leave / Abroad (more than 1 year), Under Suspension, Study Leave, Unauthorized Absence, Employee Absconded, Employee Missing etc. గా ఉన్నారో వారిని ఆ పాఠశాల లోనే చూపించాలి
*జిల్లాల విభజన లో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, ఏ ఒక్క ఉద్యోగిని విడువరాదు*
6) ప్రస్తుతం పని చేయుచున్న ఉద్యోగులతో పాటు *Long Leave / Abroad (more than 1 year), Under Suspension, Study Leave, Unauthorized Absence, Employee Absconded, Employee Missing etc.* వారిని కూడా జాబితాలో చేర్చాలి
7) ఏదేని సందర్భంలో కేటాయింపు అనంతరం మన పరిధిలో ఉద్యోగిని గుర్తించిన ఎడల ఆ ఉద్యోగి DDO పూర్తి బాధ్యత వహించాలి
8) కావున మీ పరిధిలో DDO లతో సంప్రదించి, పూర్తి సమాచారాన్ని సేకరించి సరైన సమాచారాన్ని ఇవ్వవలెను.
9) HOD వారి ద్వారా Dismissal/Removal from Service ఉత్తర్వులు పొందిన వారు, మరణించినవారు మరియు పదవీ విరమణ (Superannuation/VRS)తప్ప మిగిలిన అందరూ ఉపాధ్యాయుల వివరాలు తప్పక సేకరించి పొందుపరచాలి.
ఏదైనా సందేహ నివృత్తికి పూర్వ తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఐటి విభాగాన్ని సంప్రదించవలెను
జిల్లా విద్యాశాఖాధికారి,
పూర్వ తూర్పుగోదావరి,
కాకినాడ.