• Home/
  • /
  • నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ JOSAA

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ JOSAA

📢**నేటి నుంచి జోసా కౌన్సెలింగ్* *
 
దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది.
 
ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఐదు విడతల కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. తొలుత ఈ నెల 10వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
 తర్వాత తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ 11 నుంచి మొదలవుతుంది. 
13న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. 
30న రెండో విడత, 
జులై 6న మూడో విడత,
 జులై 10న నాలుగో విడత, 
జులై 16న చివరి విడత సీట్లను కేటాయిస్తారు. 

జులై 21తో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.