• Home/
  • /
  • రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయ- ఉద్యోగుల అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం

రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయ- ఉద్యోగుల అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం

 రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయ- ఉద్యోగుల అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం

 
 
నెలలో 2వ తేదీ మరియు ఆతరువాత పుట్టిన వారు 62సం॥లు పూర్తవగానే ఆ నెల చివరి తేదీనే పదవీవిరమణ తేదీగా భావించాలి.కానీ 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెల 30/31వ తేదీలకు 62 సం॥లు పూర్తవుతాయి కాబట్టి ముందు నెల చివరి రోజును రిటైర్ మెంట్ రోజుగా పరిగణించాలి. చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
 
రిటైర్మెంట్ కు 6 నెలల ముందుగానే SRను అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్  AG ఆఫీసుకు పంపవచ్చు. ఈ 6 నెలల్లో ఇంక్రిమెంట్ ఉన్ననూ అడ్వాన్స్ గా నమోదు చేసి పంపవచ్చు.
 
ఒక నెలలో రిటైర్ అయ్యేవారి ఇంక్రిమెంట్ కనుక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే, GO No:235 27-10-1998 ప్రకారం ఒక ఇంక్రిమెంటును మంజూరు చేయాలి.(ఇది కేవలం పెన్షన్, గ్రాట్యుటీ,కమ్యుటేషన్ లకు మాత్రమే వర్తిస్తుంది)
 
పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లవి MEOలు, ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులవి HM లు నేరుగా AG ఆఫీసు  పంపవచ్చు. DEO ఆఫీసుకు అవసరం లేదు. HM & MEOలవి మాత్రం DyEO, DEO ద్వారా AGఆఫీసుకు పంపాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం DEO ద్వారానే పంపాలి.
 
సర్వీసు 33సం॥లకు తగ్గినచో 5 సం॥ల వెయిటేజీ కలుపబడును. (VRS ఇచ్చేవారికి కూడా)
 
పెన్షన్ కు చివరి బేసిక్ పే ను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు.
 
ఉద్యోగి చనిపోయినపుడు అర్హతగల కుటుంబసభ్యులకు ఫ్యామిలీ పెన్షన్  వస్తుంది. గ్రాట్యుటీ కుటుంబసభ్యులకు పంచుతారు. వీరికి కమ్యుటేషన్ వర్తించదు
 
AG ఆఫీసువారు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ను శాంక్షన్ చేసి, DTOద్వారా STOలకు పంపుతారు.
 
పెన్షన్ ఫైల్ STO లకు చేరిన తరువాత AG ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన PPO ఒరిజినల్ కాపీ,  Bank Pass Book Xerox Copy, Aadhar & PAN Xerox, 3 Photoesలతో STO ఆఫీసుకు వెళ్లి STOను కలవాలి
 
రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డు Cancel అవుతుంది కాబట్టి,పెన్షనర్ గా కొత్త హెల్త్ కార్డు ఆరు నెలలు లోగా పొందవలసిఉంటుంది.  పెన్షన్ పేస్లిప్, PPOకాపీ, ఫోటో,రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డును తీసుకోవాలి.