• Home/
  • /
  • గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల అనుసారం, మండల పరిధిలోని నూతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి.

గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల అనుసారం, మండల పరిధిలోని నూతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి.

 గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల అనుసారం,

 
మండల పరిధిలోని నూతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి. 
 
 
మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటులో భాగంగా చేయవలసిన ముందస్తు గ్రౌండ్ వర్క్ కొరకు కొన్ని ముఖ్య సూచనలు.
 
1. ముందుగా మీ క్లస్టర్ పరిధిలో క్లస్టర్ కమిటీని ఏర్పాటు చేసుకోవలెను, ఆ కమిటీకి మీరు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించవలెను. 
2. మీ క్లస్టర్ పరిధిలో ఉన్న పంచాయతీ /వార్డుల వారీగా పాఠశాలల వివరములు  ఇవ్వడం జరిగినది. 
3. ప్రతి పంచాయతీని/ వార్డ్ యూనిట్ గా తీసుకొని, a.ఏ పాఠశాలలో మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేయాలి? b.ఏ పాఠశాలను బేసిక్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేయాలి? c.ఏ పాఠశాలను ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేయాలి? 
4. UP స్కూల్లో విషయంలో అప్గ్రేడ్/ డౌన్ గ్రేడ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి?అనే అంశములను  సమీక్ష చేసుకొని క్లస్టర్ రిపోర్టును తయారు చేసుకుని ఉంచవలెను, 
5. పాఠశాలలు తెరిచిన వెంటనే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు నిర్వహించే నూతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమావేశానికి సదరు రిపోర్టుతో హాజరు కాగలరు. 
6. ఈ ప్రక్రియలో మీకు ఎదురయ్యే సమస్యలు ఇబ్బందులు సందేహాల నివృత్తి కొరకు మండల విద్యాశాఖ అధికారుల సహాయం కోరగలరు.