• Home/
  • /
  • పెన్షనర్లకు కొత్త సౌకర్యం – NIDHI యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్

పెన్షనర్లకు కొత్త సౌకర్యం – NIDHI యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్

 *_పెన్షనర్లకు కొత్త సౌకర్యం – NIDHI యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్_*

===============
➜ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లు Annual Verification Certificate (AVC) / Life Certificate (LC) సమర్పించడం సులభం చేయడానికి కొత్త విధానం ప్రవేశపెట్టింది.
 
    *➢ముఖ్యాంశాలు*
 
ప్రతి సంవత్సరం జనవరి – ఫిబ్రవరి నెలల్లో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి.
 
➢ ఇప్పటివరకు ఈ విధానాలు ఉన్నాయి:
 
➛Jeevan Pramaan Portal ద్వారా Digital Life Certificate
 
➛Indian Post Payments Bank (Doorstep Service)
MeeSeva / Common Service Centers
 
➤పెన్షనర్ అసోసియేషన్లు
Treasury వద్ద ప్రత్యక్షంగా (Physical Mustering)
అయినప్పటికీ ప్రతి సంవత్సరం 30,000–40,000 మంది పెన్షనర్లు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో పెన్షన్ ఆగిపోతుంది.
 
➤ అందుకే ఇప్పుడు NIDHI మొబైల్ యాప్‌లో Facial Recognition Service (FRS) ప్రారంభించారు.
 
➤ NIDHI యాప్ ద్వారా AVC /  LC ఎలా ఇవ్వాలి
=================
➞మొబైల్‌లో NIDHI App ఓపెన్ చేయాలి.
➞హోమ్ పేజీలో AVC ఎంపికపై క్లిక్ చేయాలి.
➞ వ్యక్తిగత వివరాలు చెక్ చేసి Employment / Re-employment / Marriage వివరాలు అప్‌డేట్ చేయాలి.
 
➞తరువాత AVC Authentication క్లిక్ చేసి Face Recognition ద్వారా ధృవీకరణ చేయాలి.
 
✅ ఈ విధంగా పెన్షనర్లు ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా Life Certificate ఇవ్వవచ్చు.