• Home/
  • /
  • ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో టెట్ గురించి

ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో టెట్ గురించి

 ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో 
టెట్ గురించి
1. ఇన్ సర్వీస్ టీచర్లకు దసరా మరియు వేసవి సెలవుల్లో సం.కి 2 సార్లు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు అధికారుల అంగీకారం.
2. 2011 ముందు నియామకం పొందిన వారే కాక మొత్తం ఇన్ సర్వీస్ టీచర్లు అందరికి స్పెషల్ టెట్ వ్రాసుకునేలా ఇచ్చిన మెమోకు సవరణ చేయాలని కోరగా అంగీకరించారు.
3. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ బయాలజీ టీచర్లకు వారి వారి సబ్జక్ట్స్ లోనే పరీక్ష నిర్వహించాలని కోరాం.
4. సిలబస్, మార్కులు తగ్గింపు, ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహించాలని కోరడమైనది.
 
టెట్ ఎవరు, ఏమి వ్రాయాలి
1. SGT నుండి PSHM ప్రమోషన్ పొందిన వారు పేపర్ 1A వ్రాయాలి.
2. స్కూల్ అసిస్టెంట్ నుండి PSHM గా వెళ్లినవారు పేపర్ 2A వ్రాయాలి.
3. D.Ed. లేకుండా B.Ed చేసిన SGT లు పేపర్ 1A వ్రాయాలి 
4. SGT నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందిన వారు పేపర్ 2A వ్రాయాలి 
5. 5 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉన్న గజిటెడ్ హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ గా ఏ సబ్జెక్టులో పనిచేసారో ఆ సబ్జెక్టు పేపర్ 2ఆ వ్రాయాలి.
6. PET / PD, ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లు టెట్ వ్రాయనవసరం లేదు.
7. 5 సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్నవారు ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరిగా వ్రాయాలి.
8. DSC 2025 స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయినవారు SGT లు పేపర్ 1A, స్కూల్ అసిస్టెంట్ లు పేపర్ 2A వ్రాయాలి.
9. 3rd మెథడాలజీ తో ప్రమోషన్ తీసుకున్న వారు ప్రమోషన్ పొందిన సబ్జెక్టులో పేపర్ 2A వ్రాయాలి.

10. 31.08.2030లోగా రిటైర్ అయ్యేవారు ప్రమోషన్ అక్కరలేకపోతే టెట్ వ్రాయనవసరం లేదు.