🎯ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన *ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్–2025* ప్రకారం, ప్రతి శాఖలోని ఉద్యోగుల *సీనియారిటీ జాబితాలను* పాత స్థానిక కేడర్ల (జిల్లా/జోన్/మల్టీ జోన్/స్టేట్ కేడర్) ఆధారంగా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సీనియారిటీ జాబితాలో ఉద్యోగి పేరు, ఉద్యోగ వివరాలు, నియామక తేదీ, సర్వీస్ వివరాలు, కేడర్ వివరాలు తదితర సమాచారం నమోదు చేయాలి. ఉద్యోగులందరినీ ఎటువంటి మినహాయింపు లేకుండా జాబితాలో చేర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అందువల్ల సంబంధిత అధికారులు/కార్యాలయాలు నిర్ణీత గడువులోపు వివరాలను సేకరించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలి.
⚠️ ఇది కొత్త స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో కీలకమైన దశ.