E-filing చేసే ముందు, గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు....
1. మనకు సరైన ఫారం ( ITR -1, లేక ITR -4) సెలెక్ట్ చేసుకోడం.
2. ముందు ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో మనం రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఉందో లేదో, చెక్ చేయడం.
3. ప్రస్తుత ఇంటి, చిరునామా, తాత్కాలిక చిరునామా, ఒకటే నా, కదా, సరి చూసుకోవడం. మార్పు ఉంటే, ఆధార్ OTP తో మార్చుకోవడం. ఎందుకంటే, E-filing complete అయ్యాకా మనం పొందే, acknowledgeme లో పాత చిరునామా ఉంటే, కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సీనియర్లు కొంత మంది, tension పడుతున్నారు.
4. ఫార్మ్-16, AIS, 26AS, ఫారం లు, ఒకవేళ, సొంత ఇళ్లు(2 వరకు) ఉంటే, వాటి తాలూకు, మున్సిపల్ tax పే చేసిన రసీదు, ఒక వేల భార్య/ భర్త కూడా co owner ఉంటే, వారి తాలూకు, ఆధార్ మరియు పాన్ నెంబర్ దగ్గర ఉంచుకోవడం.
5. ఇన్కమ్ from house property లొ, house tax receipt address రెవెన్యూ వార్డు తో సహా ఎంటర్ చేయడం.
6. మనం ఏమైనా కారు కొని, TCS cut చేసి ఉంటే, tax paid column లొ, కొన్న సంవత్సరం సెలెక్ట్ చేయడం.
7. బ్యాంక్ లో వడ్డీ, ఆదాయం ఏమైనా వచ్చి ఉంటే, కలపడం AIS OPEN చేసి ( new tax regime లొ).
8. NPS, EMPLOYER CONTRIBUTION మనం పెట్టిన పెట్టుబడి, గ్రాస్ లొ కలిపి, 80CCD(2) లొ deduction తీసుకోవాలి.( కొంత మంది, గ్రాస్ లో యాడ్ చేయకుండా, deduction తీసుకుంటున్నారు, అలా చేయడం తప్పు. అసలు 80CCD(2) EXEMPTION తీసుకోకూడదు.
9. కొంత మంది, new tax regime లొ కూడా, PH allowance ని income tax లొ చూపడం జరిగింది, కానీ E-filing అప్పుడు దానిని సంబంధించి, సెక్షన్ ఎక్కడ లేదు, అంటే, PH ALLOWANCE కూడా, taxable income
10. May నుండి మార్చ్ వరకు రిటైర్ అయిన వారు, శాలరీ+ pension రెండు, total చేసి చూపాలి.
11. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా వచ్చి ఉంటే, తప్పకుండా Old /New tax regime లొ, అన్ని చూపి, సెక్షన్ 10 కింద tax exemption తీసుకోవడం.
12. Gross income ( including rebate 75000/-) 1275000/- ఉంటే No tax, అక్కడి మార్జినల్ రిలీఫ్ మొదలు అవుతుంది. ఒకవేళ 1300000 ఆదాయం ఉంటే, న్యూ tax slab ప్రకారం 63750/- tax ఉండాలి, కానీ మార్జినల్ రిలీఫ్ తర్వాత 13000/- tax పడుతుంది.
13. Marginal relif maximum(గరిష్టంగా 1275050 గ్రాస్ వద్ద 59957/- rebate వర్తిస్తుంది. అక్కడి నుండి rebate వర్తించదు. కొంత మంది కి బ్యాంక్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చి ఉంటే, గ్రాస్ లో యాడ్ అవుతుంది కాబట్టి, మార్జినల్ relief లో మార్పు వచ్చి, tax కాస్త ఎక్కువ అవుతుంది.
13. ఎవరైనా tax payer మరణించి ఉంటే tax refund ఉంటే ( పొందాలి) అంటే, వారి తాలూకు లీగల్ హెయిర్ మాత్రమే, ఇన్కమ్ tax portal register చేసుకుని E-filing చేయడం. Tax refund ledu, అంటే, చేయనవసం లేదు.
14. బ్యాంక్ అకౌంట్ ఏమైనా బ్రాంచ్ మారి ఉంటే, ఇంకో సారి రివాలిడేట్ చేసుకోవడం.
15. ఏమైనా tax డ్యూ ఉంటే, అప్పటికి అప్పుడు పే చేయడం.
E-filing చేసేటప్పుడు, పై విషయాలు అన్ని జాగ్రత్తగా చెక్ చేసి E-filing తప్పు లేకుండా చేసుకోగలరు..
ఇంకేమైనా Doubt/ query ఉంటె నేరుగా కాల్ / WhatsApp చేసి అడగవచ్చు. E-filing చేయించు కోవాలి అనుకుంటే, సంప్రదించవచ్చు.