• Home/
  • /
  • స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ

 

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ
 
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
▪️బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.
▪️గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక సంస్థలవారీగా రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు.
▪️బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ సేకరించిన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
▪️తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.