• Home/
  • /
  • సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి DDO లు అందరికీ తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ ఆదేశాలు నెంబరు G.O.MS.No.57 FINANCE (HR-IV, FR&LR) DEPARTMENT Dated: 20-07-2026 ప్రకారము ప్రతి ఉద్యోగి తన యొక్క సర్వీస్ రికార్డును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భాగ

సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి DDO లు అందరికీ తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ ఆదేశాలు నెంబరు G.O.MS.No.57 FINANCE (HR-IV, FR&LR) DEPARTMENT Dated: 20-07-2026 ప్రకారము ప్రతి ఉద్యోగి తన యొక్క సర్వీస్ రికార్డును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భాగ

 🙏సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి DDO లు అందరికీ తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ ఆదేశాలు నెంబరు  G.O.MS.No.57 FINANCE (HR-IV, FR&LR) DEPARTMENT Dated: 20-07-2026 ప్రకారము ప్రతి ఉద్యోగి తన యొక్క సర్వీస్ రికార్డును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భాగంగా G.O.Ms.No.99, Finance (HR-IV-FR&LR) Department, dated. 03.12.2020 ఇదివరకు జీవో ఇవ్వటం జరిగింది. ఈ జీవో ప్రాప్తికి https:// esr.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్పుడు e-SR ని డిజిటల్ గా డేటా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం జీవో 57 ప్రకారము దానిని మనం HRMS కు వాడుతున్న నిధి వెబ్సైట్ https://nidhi.apcfss.in అనుసంధానం చేస్తూ పెట్టడం జరిగింది. అలాగే ఇదివరకు చేసిన డేటా ని కూడా నిధి పోర్టల్ లోకి మార్పు చేయడం జరిగింది. ప్రస్తుతం నిధి పోర్టల్ నందు ఈ-ఎస్ఆర్ చేయవలసి ఉంటుంది. జీవో 99 ప్రాప్తికి ఎస్సార్ ని 9 భాగాలుగా విభజించి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో తొమ్మిది భాగాలుగానే విభజించి ఇవ్వటం జరిగింది. జీవో 57 ఆదేశాలు ప్రకారము జిల్లా స్థాయి నుండి క్రింద వరకు ఉన్న స్థాయి ఆఫీసులు పనిచేయుచున్న ఎంప్లాయిస్ 01-08-2026 నుండి నిధి పోర్టల్ లో e-SR నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు వెంటనే సంబంధిత HOO/DDO గారు ప్రతి ఎంప్లాయ్ యొక్క ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ ని సదరు ఉద్యోగి యొక్క ప్రతి ఒక్క ఎంట్రీని సరి చూడవలసి ఉంటుంది. అలాగే 31-07-2026 రావలసిన ప్రతి ఎంట్రీని పూర్తి చేసి సర్వీస్ రిజిస్టర్ ని స్కాన్ చేసి PDF ఫైల్ లో సేవ్ చేయవలసి ఉంటుంది. కావున ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క 1. Appointment 2. Regularization 3. Probation 4. Change in Pay 5. Leaves Availed 6. Transfers 7. Promotions 8. Deputation 9. Reversion 10. Compulsory Wait 11. Punishments 12. Suspensions 13. Relief 14. Re-Appointment 15. EL Surrender 16. Repatriation / Surrender 17. Re-instatement 18. Reporting back to Duty 19. Regularisation of Absence 20. Others (No Impact on Pay) ఏవి ఉన్నచో ఆ ఎంట్రీలో ఉన్నవి లేనిది చూసుకోవాల్సి ఉంటుంది. సదరు ఎంప్లాయ్ ఆ PDF ప్రాప్తికి డేటా చేయవలసి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగికి మూడు సర్వీస్ బుక్కులు ఉన్నచో స్కాన్ చేసేటప్పుడు మొదటి బుక్ దానికి కంటిన్యూగా రెండవ బుక్కు దాని కంటిన్యూగా మూడవ బుక్ స్కాన్ చేసి పిడిఎఫ్ తయారు చేయవలసి ఉంటుంది. అలాగే సదరు ఉద్యోగి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ యొక్క పిడిఎఫ్ ఫైల్ యొక్క పేజీ నెంబర్లు (* Ref. Page No in Scanned SR Copy) సర్వీస్ రిజిస్టర్ నమోదు చేసే సమయం అందు ఆ పేజి నెంబర్లు నమోదు చేయవలసి ఉంటుంది. బుక్ లో ఉన్న పేజీ నెంబర్లను వేయకూడదు. ఒక ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్లు మొత్తం ఎంట్రీ పేజీలను ఒకే సిరీస్ పేజీ నెంబర్లతో సహా వేసి దానిని స్కాన్ చేయవలసి ఉంటుంది. కావున 01-08-2026 ముందుగా ప్రతి ఒక్కరూ ఈ పనిని చేయవలసిందిగా తెలియజేయడమైనది. తేదీ 31-08-2026 లోగా పూర్తి చేయవలసి ఉంటుంది.01-09-2026 నుంచి ఇ-ఎస్ ఆర్ నిర్వహణ అనేది నిధి పోర్టల్ లో జరుగుతుంది. అంటే మీరు నిధి పోర్టల్లో ఒక ఉద్యోగికి పే చేంజ్ ద్వారా ఇంక్రిమెంట్ రిలీజ్ చేసినచో ఆ ఇంక్రిమెంట్ ఎంట్రీ అన్నది ఈ-ఎస్ ఆర్ లో నమోదు అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఈవెంట్ ఆన్లైన్ లోనే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కావున ఏదైనా ఈవెంట్ ఆగతాయిగా ఇందులో చేయకూడదు. అలాగే PART - 1 PERSONAL DETAILS అనేవి ఈఎస్ఆర్ లో నమోదు చేయుటకు వీలుపడదు. దీనిని మీరు ఉద్యోగి యొక్క నిధి లాగిన్ యందు ESS సర్వీస్ లో Update Personal Information అనే దానిలో ముందుగా నమోదు చేయవలసి ఉంటుంది. ఇవి ఇప్పుడే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది ఎవరైనా ఇదివరకు చేసుకోకనే ఉన్నచో ఇప్పుడు చేసినచో డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఉద్యోగి నమోదు చేసిన కొన్ని రిక్వెస్టులు సంబంధిత HOO/DDO ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. HOO/DDO లాగిన్ లో ఉన్న Approve Family and Nomination Details అనే టైల్ ద్వారా వారు ఆమోదించవలసి ఉంటుంది. తదుపరి ఈ డేటా ఈ-ఎస్ఆర్కు వెళ్లడం జరుగుతుంది. కావున ఈ ప్రాసెస్ ని మీరు ఇప్పుడే మొదలు పెట్టవచ్చు. సరైన విధంగా ప్రిపేర్ అయ్యి సరైన కాలపరిమితిలో పూర్తి చేయవలసిందిగా అందరూ అధికారులకి ఉప ఖజానా ద్వారా తెలియజేయడం జరుగుతుంది.