*ఉద్యోగుల విభజనపై సి.ఎస్.ఇ సమావేశ వివరాలు*
1)ప్రభుత్వ/జెడ్.పి ఎస్.జి.టి, ఎస్.ఎ జిల్లా కేడర్ గా ప్రతిపాదించారు.
2)ప్రభుత్వ/జెడ్.పి హెచ్.ఎం, జోన్ కేడర్ గా ప్రతిపాదించారు.
3)ఎం.ఇ.ఓ-1,2 జోన్ కేడర్ గా ప్రతిపాదించారు.
4)డీప్యూటీ ఇఓ మల్టీ జోన్ కేడర్ గా ప్రతిపాదించారు.
5)ఫారిన్ సర్వీసులో ఉన్న వారు కూడా ఆప్షన్ ఇచ్చి ఫారిన్ సర్వీసు పూర్తి అయిన తరువాత కేటాయించిన కేడర్ లో చేరాలి.
6)స్పౌజ్ వారిని ప్రాధాన్యత కేటగిరి కింద పరిగణించాలి.
7)26 జిల్లాలు 28 జిల్లాలు అయిన నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.
8)ఫీడర్ కేడర్ సర్వీస్ పరిగణనలోకి తీసుకోవాలి.
9)2025లో మంజూరైన స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను పాఠశాలలకు కేటాయించి భర్తీ చేయాలి.
10)రివర్షన్ వచ్చిన ఉపాధ్యాయుల ముందు సర్వీసును సీనియారిటీకి పరిగణన లోకి తీసుకోవాలి.
11)ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఎయిడెడ్ సర్వీస్ సీనియారిటీకి పరిగణించాలి.
12)అంతర జిల్లా బదిలీలో వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీ సమస్యపై పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
13)ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిఎస్సీ ద్వార ఎంపికైన ఉపాధ్యాయులు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారికి స్వంత జిల్లాకు వెళ్లే అవకాశం కల్పించాలి.
14)ఎస్.ఎ ఉపాధ్యాయులు పి.ఎస్.హెచ్.ఎం గా పనిచేస్తున్నారో వారిని ఏ పోస్టుకు ఆప్షన్ ఇవ్వాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలి.
15)ఎన్.సి.సి అధికారులుగా ఉన్న ఉపాధ్యాయుల ఆప్షన్ పై స్పష్టత ఇవ్వాలి.
16)ప్లస్ టు ఉపాధ్యాయుల ఆప్షన్ పై స్పష్టత ఇవ్వాలి.
17)ఉద్యోగుల విభజనకు మునుపు అన్ని డిపార్ట్మెంట్లలో పదోన్నతులు ఇచ్చినందున జూలై 5లోపు విద్యాశాఖలో పదోన్నతులు చేపట్టాలి.
18)ఉమ్మడి జిల్లా నుండి కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో పురపాలక/ నగరపాలక ఉపాధ్యాయులు పురపాలక/నగరపాలక పాఠశాలలకు బదిలీ అవకాశం కల్పించాలి.
19)సీనియర్ జూనియర్ ఈక్వలైజేషన్ ఎలా చేస్తారు.
20)కోరిన జిల్లా కేడర్ కు కేటాయించబడని ఉపాధ్యాయులకు కొత్త జిల్లా నుండి అంతర జిల్లా బదిలీలో పాత జిల్లాకు 3సం౹౹ల లోపు వస్తే సీనియారిటీ ప్రొటెక్షన్ ఇవ్వాలి.
21)2-3 సం౹౹ల లోపు పదవివిరమణ చేయు ఉపాధ్యాయులకు విభజన నుండి మినహాయింపు ఇవ్వాలి.
22)వేరు వేరు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న భార్య భర్తలకు ఒకే జిల్లాకు కేటాయించడానికి అవకాశం కల్పించాలి.
23)డయాలసిస్/హీమోఫీలీయా వారికి ప్రాధాన్యత కల్పించాలి.
24)రిలీవ్ కాని వారిని రిలీవ్ చేయుటకు చర్యలు తీసుకోవాలి.
25)ఆప్షన్ ఇవ్వడానికి ముందు ఖాళీల వివరాలు ప్రదర్శించాలి.