• Home/
  • /
  • అర్ధవేతన సెలవులు  (HALF PAY LEAVES) ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

అర్ధవేతన సెలవులు  (HALF PAY LEAVES) ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

 _*🟣అర్ధవేతన సెలవులు*_  *(HALF PAY LEAVES)*

 
_*ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.*_
 
_*సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల  ప్రకారం అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.*_
 
_*సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవురాదు.*_ *(G.O.Ms.No.165 Dt:17-08-1967)*
_*ఉదా: ఒక ఉద్యోగి 25.04.1990 న అపాయింట్ అయ్యి 31.12.2020 న రిటైర్ అవుతాడు అనుకుంటే అతని HPL ఖాతా లెక్కింపు విధానం...*_
_*25.04.1990 నుండి 24.04.2020 వరకు 30 ఏళ్ళ సర్వీసుకు 30 × 20 = 600 రోజులు జమ చేస్తారు.*_
_*25.04.2020 నుండి 31.12.2020 వరకు ఉన్న సర్వీస్ పీరియడ్ కు హాఫ్ పే లీవ్ ఏమి జమ కాదు.*_
_*కారణం : ఒక సం. సర్వీస్ కు  కొన్ని రోజులు తక్కువైన ఈ సెలవు జమ కాదు.*_
 
_*ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.*_
_*EOL కి వెళ్లినా కూడా ఆ పీరియడ్ కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు.అందుకే దీనిని*_ *"Un earned leave"* _*అంటారు.*_
 
_*అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.*_
_*అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.*_
_*1.వైద్య ధృవపత్రం ఆధారంగా*_*(Medical Certificate)*
_*2. స్వంత వ్యవహారాలపై*_ *(Private Affairs)*
 
_*సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.*_
_*ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.*_
 
_*వైద్య కారణములపై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.*_ 
*{APLR 15(B) & 18(B}*
 
_*కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.*_
*(G.O.Ms.No.186 Dt:23-07-1975)*
 
_*సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}*_
 
_*240 రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.*_
 
_*వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.*_
 
_*వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.*_
*(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005 (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)*
 
_*అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు.*_
 
_*క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ,గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.*_ 
*(G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No:449 Dt:19-10-1976)*
 
_*వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.*_  *(G.O.Ms.No.29 Dt:09-03-2011)*
 
_*ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.*_
 (G.O.Ms.No.143,Dt : 01-06-1968)
 
_*ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.*_
_*సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.*_
*(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)*