*APGLI క్రొత్త బాండ్ (APGLI New Bond) – ప్రీమియం పెంపు విధానం*
ప్రస్తుతం Basic Pay లో గరిష్టంగా 15% వరకు APGLI ప్రీమియాన్ని NIDHI Portal ద్వారా పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
✍🏻 APGLI ప్రీమియం ఎలా పెంచుకోవాలి?
1️⃣ NIDHI Portal ను ఓపెన్ చేయండి.
2️⃣ మీ CFMS ID ద్వారా లాగిన్ అవ్వండి.
3️⃣ OTP నమోదు చేసిన తర్వాత లాగిన్ పూర్తి చేయండి.
4️⃣ హోమ్ పేజీలో APGLI విండోను ఓపెన్ చేయండి.
5️⃣ మీ APGLI వివరాలు కనిపిస్తాయి.
6️⃣ "Do you want to enhance APGLI?" అనే ప్రశ్నకు YES ఎంచుకోండి.
7️⃣ గత మూడు సంవత్సరాలలో Medical Leave తీసుకున్నారా? అనే ప్రశ్నకు:
- YES అయితే సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి.
- NO అయితే అవసరమైన స్వీయ ధృవీకరణ (Declaration/Certificate) అప్లోడ్ చేయాలి.
8️⃣ మీకు ఎంత వరకు ప్రీమియం పెంచుకునే అవకాశం ఉందో సిస్టమ్ చూపిస్తుంది.
9️⃣ ఆ మేరకు మొత్తం నమోదు చేసి Submit చేయండి.
🔟 అనంతరం DDO వారి లాగిన్‌లో ఆ ప్రతిపాదనను Approve చేయాలి.
1️⃣1️⃣ చివరిగా APGLI శాఖ పరిశీలించి కొత్త APGLI Bond మంజూరు చేస్తుంది.
⚠️ గమనిక:
*MDSC–2025 ద్వారా APGLI బాండ్ పొందిన ఉద్యోగులు రెండు* *సంవత్సరాలు పూర్తైన తర్వాత మాత్రమే ప్రీమియం Enhance చేసుకోవాలి.*
*(అక్టోబర్–2027 తర్వాత మాత్రమే అర్హులు.)*