సి ఎఫ్ ఎస్ ఎం ఎస్ నందు ఈ నెల నుండి అన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
🌹దీనిని ఉపయోగించుకొని పెన్షనర్ ఈ ఫైలింగ్ సులువుగా చేసుకోవచ్చు. ఎస్ టి ఓ ఆఫీస్ వెళ్ళక్కర్లేకుండా సి ఎఫ్ ఎం ఎస్ సైట్ నుండి నేరుగా మనం యాన్యువల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం సంతోషదాయకం.
🌹చాలా కాలం నుంచి పెన్షనర్స్ అసోసియేషన్స్ చేస్తున్న డిమాండ్ ఫలితంగా ట్రెజరీస్ వారు ఈ మార్పులు తీసుకు రావడం జరిగింది.
👏యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి పరిశీలన చేద్దాం!
🌹మన సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ తో, పాస్వర్డ్ ఉపయోగించి సి హెచ్ ఎం ఎస్ లో లాగిన్ అవుతాం.
🌹 లాగిన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేసి Employee Self Services క్లిక్ చేయండి .
🌹 అందు కిందికి స్క్రోల్ చేసి payroll Services తరువాత యాడ్ చేసిన యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ పై క్లిక్ చెయ్యండి.
🤏అక్కడ మన సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ డిఫాల్ట్ గా వస్తుంది. దాని ఎదురుగా ఉన్న కాలంలో ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వ్యూ స్టేట్మెంట్ ని క్లిక్ చేయాలి
🌹Select year స్క్రోల్ చేసి చూస్తే 2024,2025,2026 మూడు సంవత్సరాలు కనిపిస్తున్నాయి అందులో 2024, 2025 సంవత్సరాలకు యాన్యువల్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ చేశారు 26 సంవత్సరంకు ఇంకను ప్రారంభం కాలేదు, కనుక అన్ని నెలల్లోనూ జీరో చూపిస్తుంది గమనించగలరు.
🌹ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత View Statement పై క్లిక్ చేయండి .
🌹వెంటనే యాన్యువల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది దానిని పిడిఎఫ్ లో సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు... మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఫోన్లో ఓపెన్ చేస్తుంటే క్లియర్ గా కనిపించడం లేదు సిస్టంలో పూర్తి వివరాలు వస్తున్నాయి.