• Home/
  • /
  • CFMS - NIDHI లో పేరు సవరణ ప్రక్రియ

CFMS - NIDHI లో పేరు సవరణ ప్రక్రియ

 📝 *CFMS - NIDHI లో పేరు సవరణ ప్రక్రియ* 📝

 
*ఉద్యోగులు/పెన్షనర్ల మాస్టర్ వివరాలు - పేరు, ఇంటిపేరు, DOB, DOJ, PAN, మొబైల్ నంబర్, GPF, APGLI, PRAN మార్చుకోవాలంటే* ఈ విధంగా చేయాలి.
 
*ఉద్యోగి పేరు సవరణకు కావలసిన డాక్యుమెంట్లు:* 
DDO అటెస్టేషన్‌తో ఈ క్రింది వాటిని జతచేయాలి 👇
1. *SR కాపీ జిరాక్స్* - మొదటి పేజీ & పేరు ఎంట్రీ ఉన్న పేజీ
2. *SSC మార్కుల జిరాక్స్*
3. *ఆధార్ జిరాక్స్*
4. *గెజిట్ కాపీ* - పూర్తి పేరు మార్పు అయితే తప్పనిసరి
5. *అన్ని డాక్యుమెంట్లలో పేరు ఒకేలా ఉండాలి*
 
*ఇతర సవరణలకు:*
- *DOJ సవరణ*: SR కాపీ, జాయినింగ్ లెటర్, జాయినింగ్ రిపోర్ట్ జిరాక్స్
- *మొబైల్ నంబర్*: వ్యక్తిగత రిప్రజెంటేషన్ + కారణం తెలిపే DDO లెటర్
- *GPF/APGLI నంబర్*: GPF ఆథరైజేషన్/APGLI బాండ్ + DDO లెటర్
- *పెన్షనర్ పేరు/DOB/మొబైల్*: PPO ఆథరైజేషన్ కాపీ + వ్యక్తిగత రిప్రజెంటేషన్
 
*పంపాల్సిన చిరునామా:* 
*The Director* 
Treasuries and Accounts Department 
First Floor, Nidhi Bhavan 
Mangalagiri
 
*ముఖ్య గమనికలు:*
1. *DDO కవరింగ్ లెటర్ / ట్రెజరీ ఆఫీసర్ ఫార్వార్డింగ్ లెటర్* తప్పనిసరి
2. లెటర్‌లో *CFMS ID, DDO ఆఫీస్ మెయిల్ ID, DDO కాంటాక్ట్ నంబర్, DDO కోడ్* తప్పక పేర్కొనాలి
3. *ఫిజికల్ కాపీని పోస్ట్ ద్వారా మాత్రమే* పంపాలి
4. పెన్షనర్ల విషయంలో *సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ ద్వారానే* DTAకు పంపాలి
 
పేరు సవరణ కావాల్సిన మిత్రులు ఈ ప్రక్రియను అనుసరించగలరు.
 
*మరిన్ని వివరాలకు మీ DDO/Treasury ఆఫీస్‌ను సంప్రదించండి.*