S*💥Flash -Flash💥. --------------------------- ISRO( INDIAN SPACE RESEARCH ORGANISATION) దరఖాస్తు చేయుటకు 3 రోజులు మాత్రమే (చివరి తేదీ 23-03-25).
విశాఖపట్నం జిల్లా ---------------------------- యువిక (Yuvika)-2025 ( యువ విజ్ఞాన కార్యక్రమం)కి భారతదేశం లోని అన్ని యాజమాన్య పాఠశాలల 9వ తరగతి విద్యార్థుల దరఖాస్తులను ఇస్రో వారు ఆహ్వానిస్తున్నారు, కావున విశాఖపట్నం జిల్లా లోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. FREE ISRO SPACE CENTERS (ALL 7 CENTERS) VISIT ---------------------------------------- సైన్స్ పట్ల ఆసక్తి , అంతరిక్ష పరిశోధనల పై జిజ్ఞాస ఉన్న విద్యార్థులకు ISRO అరుదైన అవకాశం ----------------------------------------
అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇస్రో ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (YUVIKA) పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఎంపికైన వారికి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నారు. స్పేస్ సైన్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఇస్రో యువికాను చేపడుతోంది
---------------------------------------
ఎంపికైన విద్యార్థులకు శిక్షణ:-
ఇస్రో యువికాను దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో నిర్వహిస్తోంది. విద్యార్థులకు మే నెలలో రెండు వారాల పాటు ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించి అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన కల్పిస్తారు మరియు దేశం లోని 7 ఇస్రో సెంటర్ల ను సందర్శించే అవకాశం కల్పిస్తారు... ---------------------------- 1)విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ -తిరువనంతపురం (కేరళ)
2)సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ - తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్)
3)ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - దేహ్రాదూన్ (ఉత్తరాఖండ్)
4)స్పేస్ అప్లికేషన్ సెంటర్ - అహ్మదాబాద్ (గుజరాత్)
5)నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ -షిల్లాంగ్ (మేఘాలయ)
6)యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ -బెంగళూరు (కర్ణాటక)
7)నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ -హైదరాబాద్ (తెలంగాణ) -------------------------------------- వెయిటేజీ ఇలా ఉంటుంది:
1) 8వ తరగతిలో పొందిన మార్కులకు 50% వెయిటేజీ ఇస్తారు.
2)జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో ప్రతిభ చూపితే 10% వెయిటేజీ ఇస్తారు..
3)స్పేస్, సైన్స్ క్లబ్బు ల్లో నమోదై ఉంటే 5%
4)ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%
5)గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే 20% ప్రాధాన్యమిస్తారు. -------------------------------------- యువికాకు సెలెక్ట్ అయినట్లయితే
1)విద్యార్థులకు ప్రయాణంతో పాటు వసతి, భోజన సదుపాయాలను ఇస్రో ఉచితంగానే అందిస్తుంది.. 2)సెలక్ట్ అయిన విద్యార్థులను మే నెలలో 2 వారాల పాటు ఇస్రోకు చెందిన వివిధ రాష్ట్రాల్లోని స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. స్పేస్ సెంటర్లలో సైన్స్ కు సంబంధించిన వింతలు, విశేషాలు, నవగ్రహాల సముదాయం తదితర వాటిపై స్టూడెంట్స్ కు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది ---------------------------------------- ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ:- యువికా లో భాగంగా 2025 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఆన్లైన్లో
ఏప్రిల్ 7వ తేదీన సెలక్ట్ అయిన విద్యార్థుల లిస్ట్ విడుదల చేస్తారు.
మే 18వ తేదీన విద్యార్థులను ఆహ్వానిస్తారు.
మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమం ఉంటుంది.
మే 31వ తేదీన ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ఇస్తారు.