• Home/
  • /
  • JSC Meeting Updates👇👇 ఉద్యోగుల_కేటాయింపు P.O.-2025 ఉద్యోగుల కేటాయింపు డ్రాఫ్ట్ మార్గదర్శకాలలో ప్రధానాంశాలు:

JSC Meeting Updates👇👇 ఉద్యోగుల_కేటాయింపు P.O.-2025 ఉద్యోగుల కేటాయింపు డ్రాఫ్ట్ మార్గదర్శకాలలో ప్రధానాంశాలు:

 👉JSC Meeting Updates👇👇

 
*ఉద్యోగుల*_*కేటాయింపు*
P.O.-2025 *ఉద్యోగుల కేటాయింపు డ్రాఫ్ట్ మార్గదర్శకాలలో ప్రధానాంశాలు*:
 
*👉 ఉద్యోగుల కేటాయింపుకు జిల్లా, హెచ్.ఓ.డి, సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు.*
 
*👉ముందుగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు సిద్ధం చేసి ప్రచురిస్తారు.*
 
*👉 ప్రతి ఉద్యోగి తనకు కావలసిన జిల్లా/జోన్‌కు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది*.
 
*👉ఒకసారి ఇచ్చిన ఆప్షన్‌ను తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు.*
 
*👉కేటాయింపులో ముందుగా ప్రత్యేక కేటగిరీల వారికి ప్రాధాన్యత:*
*70% పైగా వికలాంగులు*
*మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులు*
*పునర్వివాహం కాని విధవరాలు*
*క్యాన్సర్, కిడ్నీ/లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.*
 
*👉ప్రత్యేక కేటగిరీల తర్వాత సీనియారిటీ మరియు ఉద్యోగి ఇచ్చిన ఆప్షన్ ఆధారంగా కేటాయింపు.*
 
*👉 ఒక జిల్లాకు/జోన్‌కు పోస్టుల కంటే ఎక్కువ మంది ఆప్షన్ ఇస్తే సీనియారిటీ ఆధారంగానే ఎంపిక.*
 
*👉 SC, ST ఉద్యోగులను ప్రతి జిల్లా/జోన్‌లో అనుపాత పద్ధతిలో పంపిణీ చేయాలని ప్రతిపాదన.*
 
*👉కేటాయింపు జాబితా ప్రకటించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు.*
 
*👉కొత్త కేడర్‌కు కేటాయించబడిన ఉద్యోగులు 7 రోజుల్లోగా జాయిన్ కావాలి.*
 
*👉భార్యాభర్తలు వేర్వేరు జిల్లా లకు కేటాయించబడితే, కేటాయింపు ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రత్యేక దరఖాస్తు ద్వారా ఒకే జిల్లా లో అవకాశం కల్పించవచ్చు.*
 
*👉 కేటాయింపుపై అభ్యంతరాలు ఉన్న ఉద్యోగులు జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.*
 
*డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.*
 
 *ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు**  *పరిగణనలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు వెలువడనున్నాయి...