• Home/
  • /
  • LEAVE SANCTIONING OFFICERS/ORDERS

LEAVE SANCTIONING OFFICERS/ORDERS

 LEAVE SANCTIONING OFFICERS/ORDERS

 
 
....✍️
 
 
 *💥💥LEAVE SANCTIONING OFFICERS/ORDERS*
 
 
విద్యాశాఖలో వివిధ రకాల సెలవుల మంజూరు,రిపోర్టింగ్,రిపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల కాలపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వబడినవి.
(G.O.Ms.No.58,Edn తేది:22-04-2008)
(G.O.Ms.No.70,Edn తేది:07-07-2009)
 
 
*💥PS & UPS ప్రధానోపాధ్యాయులు*
  
  
పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl.CL మంజూరు.
 
 
*💥ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు*
 
 
పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL,Spl.Cl,CCL లతో పాటు 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు.
 
 
*💥మండల విద్యాధికారి(MEO)*
 
మండల పరిధిలోని PS,UPS ప్రధానోపాధ్యాయులకు CL,Spl.CL,CCL మరియు ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరుచేస్తారు.
 
 
*💥జిల్లా ఉపవిద్యాధికారి(Dy.EO)*
 
 
హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు CL,Spl.CL,CCL లతో పాటు తన పరిధిలోని PS,UPS&HS ఉపాధ్యాయులందరికీ 6 నెలల వరకు ఇతర సెలవును మంజూరుచేస్తారు.
 
 
 *💥జిల్లా విద్యాశాఖాధికారి(DEO)*
 
 
Dy.Eo,MEO లకు CL,Spl.CL,CCL మంజూరుచేస్తారు.Dy.Eo,MEO,హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సం॥ లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరుచేస్తారు.
 
 
*💥పాఠశాల విద్యాశాఖ సంచాలకులు(DSE)*
 
 
మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు 1 సం॥ పైబడి 4సం॥ వరకు ఏ రకపు సెలవునైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మంజూరుచేస్తారు. అంతకుమించిన కాలానికి సెలవు మంజూరు అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.
 
 
 *💥ప్రసూతి సెలవు* 
 
 
మహిళా ఉపాధ్యాయులకు 6 నెలల వరకు సెలవు మంజూరుచేయు అధికారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు,మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారం మండల విద్యాధికారులకు(MEO) లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
(G.O.Ms.No.84 తేది:17-09-2012)
 
 
 *💥విదేశాలకు వెళ్ళేందుకు సెలవు మంజూరు*
 
 
విదేశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు ఏ రకమైన సెలవుపై ఎంతకాలం వెళ్ళదలచుకున్నా (5సం॥ లోపు) ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి.విదేశాలలో ఉద్యోగం కొరకు వెళ్ళే ఉద్యోగులకు కొన్ని షరతులతో 5సం॥ వరకు EOL మంజూరుకు అనుమతిస్తారు.
(G.O.Ms.No.214 F&P తేది:03-09-1996).