సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్, అమరావతి
రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొసీడింగ్స్
హాజరు: శ్రీ బి. శ్రీనివాసరావు, ఐ.ఏ.ఎస్.
Pr.Rc.No. SS-16021/71/2024-CMO SEC-SSA
తేదీ: 20-08-2026
విషయం:
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్, అమరావతి – 2026-27 విద్యా సంవత్సరానికి SRKVM కిట్ల కొనుగోలు మరియు సరఫరా – క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయిలో “షూ మేళా” నిర్వహణ – ఉత్తర్వులు జారీ – సంబంధించి.
ఉత్తర్వులు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (SRKVM-II) పథకం కింద నోట్‌బుక్స్, బెల్ట్, ఒక జత షూస్, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం వస్త్రాలు, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు మరియు వర్క్‌బుక్స్ అందించాలని నిర్ణయించింది.
షూస్ మరియు రెండు జతల సాక్స్ మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేయబడ్డాయి. అయితే పంపిణీ సమయంలో కొంతమంది విద్యార్థులకు షూ సైజులలో తేడాలు/సరిపోకపోవడం గుర్తించబడింది. ప్రతి విద్యార్థికి సరైన సైజు షూ అందించేందుకు షూ ఎక్స్చేంజ్ మేళా (Shoe Mela) నిర్వహించాలని నిర్ణయించారు.
షూ మేళా నిర్వహణ షెడ్యూల్
1. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ స్థాయి
తేదీలు: 26-08-2026 నుండి 03-09-2026 వరకు
క్లస్టర్ పరిధిలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన షూలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠశాలల మధ్య పరస్పరం మార్పిడి చేయాలి.
ప్రతి విద్యార్థికి సరైన సైజు షూ అందేలా క్లస్టర్ స్థాయిలో షూ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించాలి.
మేళా అనంతరం మిగిలిన లేదా అవసరం లేని షూలను సరైన రసీదు/అంగీకార పత్రంతో మండల స్టాక్ పాయింట్‌కు అప్పగించాలి.
షూల మార్పిడి మరియు అప్పగింత సమయంలో తప్పనిసరిగా సంబంధిత వారి సంతకాలతో రికార్డులు నిర్వహించాలి.
2. మండల స్థాయి
తేదీలు: 07-09-2026 నుండి 16-09-2026 వరకు
మండలంలోని వివిధ క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌ల వద్ద అందుబాటులో ఉన్న షూలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల మధ్య మార్పిడి చేయాలి.
ప్రతి విద్యార్థికి సరైన సైజు షూ అందేలా మండల స్థాయిలో షూ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించాలి.
మేళా అనంతరం మిగిలిన లేదా అవసరం లేని షూలను సరైన అంగీకార పత్రంతో జిల్లా స్టాక్ పాయింట్‌కు అప్పగించాలి.
మార్పిడి మరియు అప్పగింతలకు సంబంధించిన అన్ని రికార్డులను సంతకాలతో భద్రపరచాలి.
3. జిల్లా స్థాయి
తేదీలు: 18-09-2026 నుండి 25-09-2026 వరకు
జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన షూలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మండలాల మధ్య మార్పిడి చేయాలి.
ప్రతి విద్యార్థికి సరైన సైజు షూ అందేలా జిల్లా స్థాయిలో షూ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించాలి.
మిగిలిన లేదా అవసరం లేని షూలను జిల్లా స్టాక్ పాయింట్‌లో భద్రపరచాలి..
ఆదేశాలు:
అవసరమైన చోట విద్యార్థులకు జారీ చేసిన షూలను సరైన సైజు షూలతో మార్పిడి చేయాలి. అందరు మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేసి, ఈ ఉత్తర్వుల అమలుపై చర్యలు తీసుకొని కంప్లయన్స్ నివేదిక సమర్పించాలి.
DEO NTR, APC SS NTR