మండలాల విద్యా శాఖాధికారులకు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు P3 – PUBLIC POSITIVE PERCEPTION గురించి ముఖ్య సూచనలు
(పాఠశాల నిర్వహణ అంశాలపై తల్లిదండ్రులకు IVR కాల్స్ స్పందన విధానం)
ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాల విద్యాశాఖ నుండి తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఫోన్ కాల్స్ (IVR Calls) రావడం జరుగుతుంది. ఈ ఫోన్ కాల్స్‌లో అడిగే ప్రశ్నలకు తల్లిదండ్రులు కింది విధంగా స్పందించి, కచ్చితంగా సమాధానం ఇవ్వవలెను:
సమాధానం అవును / YES అయితే: మొబైల్‌లో 1 నొక్కాలి.
సమాధానం కాదు / NO అయితే: మొబైల్‌లో 2 నొక్కాలి.
🔹Item 1: పాఠశాల విద్యా విధానం (School Education)
1. మీ పిల్లలు చదివే పాఠశాలలో టీచర్లు (Teachers) సకాలంలో విధులకు హాజరవుతున్నారా?
2. మీ పిల్లలు చదివే పాఠశాలలో టీచర్లు ప్రతి రోజు క్రమం తప్పకుండా పాఠాలు చెబుతున్నారా?
3 . మీ పిల్లలు చదివే పాఠశాలలో భవనాలు మరియు తరగతి గదులు సక్రమంగా ఉన్నాయా?
4. మీ పిల్లలు చదివే పాఠశాలలో టీచర్లు చెప్పే పాఠాలు పిల్లలకు అర్థమవుతున్నాయా?
🔹Item 2: మధ్యాహ్న భోజన పథకం (MDM)
5 . పాఠశాలలో అందించే గుడ్డు (Eggs) నాణ్యతగా ఉన్నాయా?
6 . పాఠశాలలో అందించే చిక్కీలు (Chikkies) నాణ్యతగా ఉన్నాయా
7. మధ్యాహ్న భోజన ఆహారం నాణ్యత సంతృప్తికరంగా ఉందా?
🔹Item 3: టాయిలెట్ నిర్వహణ నిధి (TMF)
8 . పాఠశాలలో టాయిలెట్లు (Toilets) శుభ్రంగా ఉన్నాయా?
9 . టాయిలెట్ల నిర్వహణ మరియు సదుపాయాల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?
ప్రధానోపాధ్యాయులు (HMs) ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సహాయంతో పైన పేర్కొన్న 9 ప్రశ్నలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలి.
IVR కాల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా బటన్స్ నొక్కి (అవును = 1, కాదు = 2) స్పందించాలో స్పష్టంగా వివరించాలి.
తల్లిదండ్రులు ఈ ఫోన్ కాల్స్‌లో చురుగ్గా పాల్గొనేలా మరియు సరైన అభిప్రాయాలను పంచుకునేలా నిరంతరం మోటివేట్ చేయాలి.