⏺️*అందరికీ గమనిక: SADAREM Slot Booking సేవల్లో చేసిన కొత్త మార్పులు*
🔘*ఇంతకుముందు వరకు SADAREM Slot Booking ప్రక్రియ సచివాలయాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా క్రింది కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చాము.*
*1️⃣. APSeva – Citizen Login ద్వారా Slot Booking*
ఇకపై APSeva – Citizen Login ద్వారా ప్రతి పౌరుడు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్వయంగా తమకు తామే SADAREM Slot Booking చేసుకునే అవకాశం కల్పించాము.
Assessment పూర్తయిన తర్వాత SADAREM Certificate Download చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము.
*2️⃣. WhatsApp – eGovernance ద్వారా SADAREM Services*
WhatsApp eGovernance Services లో కూడా SADAREM సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాము.
🔵*దీనిలో భాగంగా:*
Slot Availability తెలుసుకునే సదుపాయం
SADAREM Slot Booking సదుపాయం
SADAREM Certificate Download సదుపాయం
అందుబాటులోకి తీసుకువచ్చాము.
అంటే, WhatsApp సేవలు అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా SADAREM Slot Availability చూసుకుని, తమకు అనుకూలమైన Slot ను స్వయంగా Book చేసుకోవచ్చు.
✅ఈ కొత్త విధానాల ద్వారా ప్రజలు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా SADAREM సేవలను మరింత సులభంగా వినియోగించుకునే అవకాశం కల్పించాము.
అందరూ ఈ మార్పులను గమనించి, ప్రజలకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి సహకరించగలరు.
ధన్యవాదాలు....