• Home/
  • /
  • SCIENCE EXIBITION-2025-26 సైన్స్ ఎగ్జిబిషన్స్ 2025-26:

SCIENCE EXIBITION-2025-26 సైన్స్ ఎగ్జిబిషన్స్ 2025-26:

 🍇

 
 
*సైన్స్ ఎగ్జిబిషన్స్ 2025-26:*
  
 ఆంధ్రప్రదేశ్‌లోని పిల్లల్లో సృజనాత్మకత, ఉత్సుకత, ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడంలో భాగంగా  సైన్స్ ఎగ్జిబిషన్‌లను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ క్రింది అంశాలపై ప్రకాశం జిల్లాలోని విజ్ఞాన ప్రదర్శన నిర్వహించుటకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సి.వి. రేణుక గారు ఆదేశించి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం క్రింది థీమ్స్ నోటిఫికేషన్.
 1.సస్టైనబుల్ అగ్రికల్చర్.
 2. వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్  ప్లాస్టిక్.
 3. గ్రీన్ ఎనర్జీ
 4. ఎమర్జింగ్ టెక్నాలజీస్
 5. రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్.                                                      6. హెల్త్ అండ్ హైజిన్.                        7. వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్.
 జిల్లాలోని ప్రతి హైస్కూల్  జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్  లో తప్పనిసరిగా పాల్గొనాలి.
*అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే*
 
*మండలం స్థాయి పోటీలు..*
*18.12.2025*
 
*జిల్లా స్థాయి పోటీలు....*
*20 లేదా 21 డిసెంబర్
 
నిర్వహించడం జరుగుతుంది.
 
*👉🏼ముఖ్య గమనిక*   :
 
*పదవ తరగతి విద్యార్థులు పై పోటీలలో పాల్గొనరాదు*
*👉🏼 మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి*
ప్రతి  సబ్ థీమ్ ఒక్కొకటి చొప్పున  7 ప్రాజెక్టు లు
  మరియు ఒక టీచర్ ప్రాజెక్ట్ జిల్లాస్థాయి పంపవలెను.
   .ఈ విజ్ఞాన ప్రదర్శన పండుగలా జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సి. వి .రేణుక   గారు ఆదేశించి ఉన్నారు. ప్రాజెక్టులు ఇచ్చిన అంశాలకు సంబంధించి క్వాలిటీగా మరియు నూతన ఆవిష్కరణలకు దారి తీసేటట్లుగా ఉండాలి. పిల్లలలో ఆవిష్కరణ పట్ల ఆసక్తిని కలిగించేలా సైన్స్ ప్రదర్శన నిర్వహించాలి అలాగే ఈ సైన్స్ ప్రదర్శనను ఉన్నత పాఠశాల పరిధిలోని ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు దర్శించేటట్లు ఏర్పాటు చేయాలి                                                        
 
 
 
🌹