• Home/
  • /
  • SMC ELECTIONS...

SMC ELECTIONS...

 *🎯SMC ELECTIONS...*

 
 *ఇప్పుడు జరగబోయే పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల గైడ్ లైన్స్ మారాయి.. గతంలో తరగతిని యూనిట్ గా తీసుకుని ఎన్నిక జరిగేది.. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం స్కూల్ ని యూనిట్ గా తీసుకుని ఎన్నిక జరగవలసి ఉంటుంది...*
 
*అభ్యర్థుల ఎంపిక ఎలా చేయాలి?*
 
*పాఠశాల ఒక యూనిట్ గా ఎన్నిక నిర్వహించవలసి ఉంది..*
 
*కావున*
 
*ఓటర్లందరూ ఒక నిర్ణీత ప్రదేశంలో కూర్చున్న తరువాత....*
 
*ప్రతిపాదించిన అభ్యర్థి లేదా తనకు తానే ప్రతిపాదించుకున్న అభ్యర్థి నిలబడతారు...*
 
 *అతనికి ఆమోదం తెలిపే వారందరూ చేతులు ఎత్తడం లేదా వేరే విధానం ద్వారా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.*
 
*ఓట్ల సంఖ్యను  ఉపాధ్యాయులు లెక్కించి నమోదు చేసి నిర్ణయించవలసి ఉంటుంది.*
 
 *తదుపరి రెండవ అభ్యర్థి నిలబడతారు.*
 
*అతనికి కూడా ఓటర్లందరూ చేతులు ఎత్తడం లేదా వేరే విధానం ద్వారా ఆమోదం తెలియజేయవలసి ఉంటుంది.*
 
  *ఈ విధంగా మనం ముందుగా నిర్ణయించుకున్న సభ్యుల సంఖ్య ప్రకారం సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది..*
 
 *ఈ ఎన్నుకునే క్రమంలో  అన్ని తరగతులనుండి ప్రాతినిధ్యం వహించే విధంగా,50% మహిళలు ఉండే విధంగా , అన్ని వర్గాల వారు ప్రాతినిధ్యం వహించే విధంగా సభ్యుల ఎంపిక జరిగేటట్లుగా ప్రధానోపాధ్యాయులు చూడవలసి ఉంటుంది....*
 
*100మంది విద్యార్థుల వరకు ఉన్న పాఠశాలకు 12 నుంచి 15 మంది సభ్యులు..*
 
*అందులో 75% తల్లిదండ్రుల నుంచి..*
 
*101 నుంచి  500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 15 నుంచి 20 మంది సభ్యులు... అందులో 75% తల్లిదండ్రుల నుంచి...*
 
*500 పైన విద్యార్థులు ఉన్న పాఠశాలకు 20 నుంచి 25 మంది సభ్యులు...*
 
 *అందులో 75% తల్లిదండ్రుల నుంచి.. ఎన్నుకోవాల్సి ఉంటుంది..*
 
*మిగిలిన 25% సభ్యుల్లో ఉపాధ్యాయుల నుంచి 1/3 వంతు....*
 
 *పూర్వ విద్యార్థులు, సెక్రటేరియట్,Anm etc... ఈ విధంగా విభజించిన కేటగిరీ నుంచి 1/3 వంతు..*
 
 *మిగిలిన 1/3 వంతు స్థానిక సంస్థల నుండి..*
 
*(ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు కాబట్టి జరిగిన తదుపరి స్థానిక సంస్థల వారే వారి సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది. అప్పటివరకు స్థానిక సంస్థల సభ్యుల స్థానం ఖాళీగా ఉంచవలెను.)*