SSC 100 DAYS ACTION PLAN MARKS ENTRY IN LEAP APP ,HOW TO ENTER 100 DAYS ACTION PLAN MARKS IN LEAP APP
CLICK HERE TO WATCH HOW TO ENTER SSC 100 DAYS ACTION PLAN MARKS IN LEAP APP
CLICK-HERE-TO-WATCH-SSC-100-DAYS-ACTION-PLAN-MARKS-IN-LEAP-APP

SCERT-SSC 100 DAYS ACTION PLAN-2025-26
జిల్లాలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులకు / ఇన్‌చార్జీలకు తెలియ జేయునది ఏమనగా...
1. 6.12.2025 (శనివారం) నుండి 10వ తరగతి విద్యార్థులకు SCERT వారు రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయవలెను.
2. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు సాయంత్రం SCERT నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ఒక సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించ వలెను.
3. రోజువారీ అసెస్మెంట్ కోసం షైనింగ్ స్టార్స్ మరియు రైజింగ్ స్టార్స్ కోసం విడివిడిగా మన DCEB విషయ నిపుణులు రూపొందించిన ప్రశ్నాపత్రాలు మీకు పంపబడతాయి.
వాటిని అమలు చేసి, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, మార్కులను LEAP యాప్‌లో అప్పటికప్పుడు నమోదు చేయవలెను.
4. పర్యవేక్షణాధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు, PMR లో నమోదు చేసిన రోజువారీ మార్కులను చూపించవలెను.
5. సెలవుదినాలలో కూడాను, SCERT వారు సూచించిన సబ్జెక్టులపై, ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు తరగతులు మరియు అసెస్మెంట్‌లను తప్పనిసరిగా నిర్వహించ వలెను.
6. ప్రతిరోజు యాక్షన్ ప్లాన్ టైమ్‌టేబుల్ ప్రకారం తరగతులు మరియు పరీక్షలు నిర్వహించబడ వలెను.
7. పర్యవేక్షణాధికారులు పాఠశాలలకు వచ్చినప్పుడు, 10వ తరగతి విద్యార్థుల ప్రగతిని సమీక్షించి, వారిని Shining Stars గా తీర్చిదిద్దేందుకు తగిన సూచనలు ఇవ్వవలెను.
8. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరూ కలిసి మీ పాఠశాలలో 100% ఫలితాలను సాధించేలా, సాధ్యమైనంత ఎక్కువ మందికి 600/600 మార్కులు వచ్చే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలెను.
9. ఉపాధ్యాయులు జవాబు పత్రాలను దిద్దిన తర్వాత
మీ User ID & Password తో లాగిన్ అయి:
Student → Actions → Assessment → 100 Days Action Plan → Select Month → Select Date → Subject → Select Section (1-Rising Stars / 2-Shining Stars) → Enter Marks → Submit చేయ వలెను.
(నిన్న నిర్వహించిన Parent Meeting లో Parents Login చేయగల విధంగా యాప్ ఓపెన్ చేయబడినందున, వారు తమ పిల్లల మార్కులు నేరుగా చూడగలరు.)
* 10.SCERT వారు ఏవైనా క్రొత్త సూచనలు / మార్పులు తెలియ జేసినట్లయితే, వాటిని అనుసరించి ప్రణాళికలో అవసరమైన మార్పులు చేసి, వాటిని తప్పనిసరిగా పాటించవలెను.విద్యార్థులు వ్రాసిన ఆన్సర్ పేపర్స్ పాఠశాల యందు భద్రపరచ వలెను.