*🟢 వర్క్ అడ్జస్ట్‌మెంట్ FAQs (29-06-2026) – ముఖ్యమైన స్పష్టీకరణలు*
🏫 హైస్కూల్ ప్లస్ (High School Plus) సర్దుబాటు
✅ PG అర్హత ఉన్నంత మాత్రాన ఉపాధ్యాయులను అదే పాఠశాలలో కొనసాగించరు. DEO గారు ఉమ్మడి జిల్లా (Erstwhile District) వారీగా PG అర్హత కలిగిన Surplus School Assistants జాబితా తయారు చేసి, సీనియారిటీ, Willingness ఆధారంగా High School Plus పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు.
✅ High School Plus పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి Willingness తప్పనిసరి. Willingness లేకుండా Cluster Teachers ను సర్దుబాటు చేయరాదు.
✅ PGTs మరియు High School Plus Subject Teachers సర్దుబాటుకు ఉమ్మడి జిల్లా (Erstwhile District) యూనిట్‌గా పరిగణించబడుతుంది.
✅ ఈ Work Adjustmentలో Sanctioned Post లేకపోయినా, అవసరమైన Subject (ఉదా: Urdu) ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించవచ్చు.
🏫 పాఠశాల సిబ్బంది & Surplus స్థితి
✅ Cluster High Schoolలో విద్యార్థుల సంఖ్య 75 కంటే తక్కువ ఉన్నప్పటికీ, Headmaster (HM) పోస్టును Surplusగా పరిగణించరు.
✅ Model Primary Schoolలో విద్యార్థుల సంఖ్య 60+ నుండి 55కు తగ్గి PSHM పదవీ విరమణ చేసినా, అక్కడి 4 మంది SGTలను Surplusగా పరిగణించరు. ఆ పాఠశాలలో 1 PSHM + 3 SGTలు ఉన్నట్లుగా పరిగణిస్తారు.
✅ 2025లో బదిలీ అయినప్పటికీ Reliever లేక విడుదల కాని ఉపాధ్యాయుల పోస్టులను ఈ Work Adjustmentలో Vacantగా చూపించాలి.
✅ ఈ విద్యా సంవత్సరంలో Zero Enrollment కారణంగా మూతపడిన Aided Schools ఉపాధ్యాయులను నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయవచ్చు.
🏫 FAC (Full Additional Charge) సంబంధిత స్పష్టీకరణలు
✅ MEO/HM FACలో పనిచేస్తున్న పోస్టులో Subject Teacherను సర్దుబాటు చేయడానికి అనుమతి ఉంది.
✅ ఒక పాఠశాలలో 3 SA (English) పోస్టులు ఉండగా, ఒకరు FAC HMగా పనిచేస్తే, Surplus SA (English)ను అదే పాఠశాలలో HM పోస్టుకు సర్దుబాటు చేసి పోస్టును కొనసాగించవచ్చు.
📘 G.O.Ms.No.21 (Subject Order)
✅ UP పాఠశాలల్లో Subject Order తప్పనిసరిగా G.O.Ms.No.21 (13-05-2025) Annexure ప్రకారమే అనుసరించాలి.
✅ ప్రాధాన్యత క్రమంలో అవసరమైన Subject Teacher అందుబాటులో లేకపోతే, ఆ క్రమాన్ని భంగం కలిగించకుండా తదుపరి Subjectకు వెళ్లవచ్చు.