⭕⭕
_*💦వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరుకు దరఖాస్తు అడగడం నిబంధనల ఉల్లంఘనే !*_
* _*ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏటా లభించే వార్షిక ఇంక్రిమెంటు వారి సేవలకు గుర్తింపుగా చట్టబద్ధంగా లభించే హక్కు.కానీ, క్షేత్రస్థాయిలో కొందరు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (డీడీఓలు) వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే...*_ _*భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది.*_ _*ఇంక్రిమెంటు కావాలా? అయితే దరఖాస్తు పెట్టుకో...*_ _*లేదంటే ఫైలు కదలదు అంటూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో చూద్దాం!*_
_*🔖దరఖాస్తు ఎందుకు ? ఎఫ్.ఆర్.24 ఏం చెబుతోంది ?*_
* _*నిబంధనల ప్రకారం...వార్షిక ఇంక్రిమెంటు మంజూరు కోసం ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.*_ _*ఫండమెంటల్ రూల్ 24 ప్రకారం, ఒక ఉద్యోగి ఇంక్రిమెంటును పైఅధికారులు అధికారికంగా నిలిపివేయకపోతే, 12 నెలల సర్వీసు పూర్తి కాగానే అది విధిగా మంజూరు కావాల్సిందే.గడువు తేదీ రాగానే సంబంధిత డీడీఓలే స్వయంగా ఇంక్రిమెంటు ధ్రువపత్రం (Increment Certificate) పై సంతకం చేసి బిల్లులు పాస్ చేయాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది.దీనికోసం కార్యాలయంలో ఒక ప్రత్యేకంగా*_ *Periodical Incremental Register* _*నిర్వహించాల్సిన బాధ్యత మంజూరు అధికారులదే.తన పరిధిలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి ఏ నెలలో ఇంక్రిమెంటు వస్తుందో ఆ రిజిస్టర్ ద్వారా అధికారులు ముందే గమనించి, ఆటోమేటిక్‌గా మంజూరు చేయాలి.కానీ, ఈ రిజిస్టర్లను అటకెక్కించి, ఉద్యోగులను తమకు దరఖాస్తులు సమర్పించాలనడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.*_
* _*నెల మధ్యలో వచ్చే ఇంక్రిమెంటు తేదీల వల్ల లెక్కల్లో గందరగోళం లేకుండా ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెం. 133 (తేదీ: 13-05-1974), జీవో నెం. 1654/హెచ్1/77-1 (తేదీ: 13-05-1977) ప్రకారం...నెల మధ్యలో ఏ తేదీన ఇంక్రిమెంటు ఉన్నా, దానిని ఆ నెల మొదటి తేదీకే మార్చాలి.ఆర్థిక ప్రయోజనాలను కూడా సదరు నెల మొదటి తేదీ నుంచే చెల్లించాలి.వేతన నష్టపు అసాధారణ సెలవు (EOL) కారణంగా ఇంక్రిమెంటు తేదీ మారి,అది నెల మధ్యలోకి వచ్చినా సరే...పైన పేర్కొన్న జీవోల ప్రకారం ఆ నెల మొదటి తేదీ నుంచే ఆర్థిక ప్రయోజనం కల్పించాలి.*_
_*🔖సెలవుల్లో ఉంటే పరిస్థితి ఏంటి ?*_
* _*మెటర్నిటీ సెలవు, గర్భస్రావ సెలవు లేదా మరేదైనా లీవ్‌లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు వస్తే ఏం చేయాలనే దానికి మెమో నెం. 49643-ఎ/2111/ఎఫ్.ఆర్2/74-1 (తేదీ: 06-10-1974) దిక్సూచిగా ఉంది. సెలవు కాలంలోనే ఇంక్రిమెంటుకు అవసరమైన 12 నెలల కాలం పూర్తయితే...సదరు ఉద్యోగి సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరిన తేదీ నుంచి ఇంక్రిమెంటు ఆర్థిక ప్రయోజనాన్ని చెల్లించాల్సి ఉంటుంది.*_
_*🔖ఇంక్రిమెంట్లు ఆపే అధికారం డీడీఓలకు ఉందా ?*_
* _*కొంతమంది డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులపై ఉన్న వ్యక్తిగత కక్షలు, చిన్నచిన్న కారణాలు లేదా అవగాహనాలోపంతో ఇంక్రిమెంట్లు నిలిపివేస్తున్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం.సీసీఏ నిబంధనలు 1991 ప్రకారం...ఒక ఉద్యోగి ప్రవర్తన సక్రమంగా లేకపోయినా,విధుల నిర్వహణ అసంతృప్తికరంగా ఉన్నా ఇంక్రిమెంట్లు నిలిపివేసే (Withhold) అధికారం కేవలం అపాయింటింగ్ అథారిటీకి మాత్రమే ఉంటుంది. అపాయింటింగ్ అథారిటీ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఏ డీడీఓ కూడా సొంత నిర్ణయాలతో ఇంక్రిమెంట్లు ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఏ డీడీఓ అయినా అలా చేస్తే... బాధిత ఉద్యోగులు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తే సదరు డీడీఓపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.*_
_*🔖శిక్షల్లో రకాలు... వాటి ప్రభావం!*_
* _*ఇంక్రిమెంట్ల నిలిపివేతలో రెండు రకాల శిక్షలు ఉంటాయి.వీటిపై కూడా అవగాహన అవసరం. నాన్-క్యుములేటివ్ ప్రభావంతో శిక్ష విధిస్తే...శిక్షా కాలం ముగిసిన తర్వాత నిలిపివేసిన ఇంక్రిమెంట్లన్నింటినీ ఒకేసారి మంజూరు చేస్తారు.అయితే,శిక్ష అమల్లో ఉన్న కాలానికి సంబంధించిన వెనకటి బకాయిలు మాత్రం లభించవు. క్యుములేటివ్ ప్రభావంతో శిక్ష విధిస్తే నిలిపివేసిన ఇంక్రిమెంట్లు శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తుంది.ఇది ఉద్యోగి భవిష్యత్తు పెన్షన్‌పై కూడా ప్రభావం చూపుతుంది.*_ _*నిబంధనలు ఇంత స్పష్టంగా, పారదర్శకంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు డిమాండ్ చేయడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం పరిపాలనా లోపమే అవుతుంది. ఇంక్రిమెంట్ల మంజూరుకు దరఖాస్తలు తీసుకునే అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకుంటే వారికే మంచిది. నేను మూడు ఉన్నత పాఠశాలల్లో డీడీఓగా పని చేశాను.వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరుకు ఏనాడూ,ఏ పాఠశాలలోనూ దరఖాస్తులు తీసుకోలేదు. డీడీఓలు తమ ఇష్టానుసారం కాకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నదే నా ఉద్దేశ్యం.*_