💥 వర్క్ అడ్జస్ట్మెంట్ – మండల విద్యాశాఖ అధికారులకు ముఖ్య సూచనలు (Points-wise)
1. నిన్నటి వరకు మండల లాగిన్‌లో సమర్పించిన Surplus & Deficit వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయం అప్డేట్ చేసింది.
2. మండల విద్యాశాఖ అధికారులు తమ లాగిన్ నుండి తాజా వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
3. డౌన్‌లోడ్ చేసిన వివరాలను మరొకసారి పూర్తిగా పరిశీలించి ధృవీకరించాలి.
4. హై స్కూల్ ప్లస్ (HS Plus) లో ఎన్రోల్మెంట్ ఉండి ఖాళీగా ఉన్న PGT పోస్టులను Deficit గా చూపించాలి.
5. శాంక్షన్ ఉన్న హై స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టు ఖాళీగా ఉండి, FAC ద్వారా పనిచేస్తున్న School Assistant పోస్టును కూడా Deficit గా చూపించవచ్చు.
6. FACగా పనిచేస్తున్న School Assistant సబ్జెక్టు అదే పాఠశాలలో Surplus అయితే, ఆ Surplusను FAC అవసరానికి మినహాయించవచ్చు. (Surplusగా చూపాల్సిన అవసరం లేదు.)
7. 31-07-2026 నాటికి పదవీ విరమణ చేసే ప్రధానోపాధ్యాయుల స్థానంలో FAC తీసుకునే School Assistant సబ్జెక్టును కూడా Deficit గా చూపించవచ్చు. ఈ సందర్భంలో ఆ సబ్జెక్టు Surplus అయితే దానిని Surplusగా చూపనవసరం లేదు.
8. 31-07-2026 తరువాత కూడా Long Leaveలో ఉన్న ప్రధానోపాధ్యాయుల స్థానంలో FACగా పనిచేస్తున్న School Assistantలకు కూడా పై నిబంధన వర్తిస్తుంది.
9. అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో అవసరమైన School Assistant పోస్టులు 2 ఉండి, పనిచేస్తున్న School Assistants కూడా 2 మంది ఉంటే, సబ్జెక్టులతో సంబంధం లేకుండా వారిని కొనసాగించవచ్చు. Surplus/Deficit వర్తించదు.
10. అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల మొత్తం ఎన్రోల్మెంట్ 30 కంటే ఎక్కువైతే 4 School Assistant పోస్టులు అవసరం. ప్రస్తుతం 4 మంది School Assistants పనిచేస్తుంటే, సబ్జెక్టులతో సంబంధం లేకుండా వారిని కొనసాగించవచ్చు. ఈ సందర్భంలో కూడా Surplus లేదా Deficit ఉండదు.
11. పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మండలంలోని అన్ని పాఠశాలలలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన Surplus & Deficit వివరాలను మరోసారి సరిచూడాలి.
12. డౌన్‌లోడ్ చేసిన వివరాలకు ప్రింట్ తీసుకుని, ఏవైనా సవరణలు ఉంటే ఎర్ర సిరాతో (Red Ink) సరిచేసి, ప్రతి పేజీ కింద Number of Corrections నమోదు చేయాలి.
13. సవరించిన ప్రింట్ కాపీని వెంటనే కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మెయిల్ చేయాలి.
— జిల్లా విద్యాశాఖ అధికారి, కాకినాడ