01.12.2025
విద్యా శాఖ కమీషనర్ WEBEX మీటింగ్ ముఖ్యాంశాలు::-
నేటి ఈ విద్యా సంవత్సరం ఇన్విజిలేషన్ డ్యూటీలు స్టేట్ ఆఫీస్ నుండే పంపడం జరుగుతుంది. డ్యూటీ వచ్చిన వారు తప్పకుండా డ్యూటీ కి హాజరు కావాలి.
అదేవిధంగా స్పాట్ వాల్యుయేషన్ ఆర్డర్స్ కూడా స్టేట్ నుండే రావడం జరుగుతుంది.
వాల్యుయేషన్ సమయంలో ఒక్కొక్క విద్యార్థి ఆన్సర్ స్క్రిప్ట్ కనీసం 12 నుండి 15 నిముషాలు వాల్యుయేషన్ చేయాలి.
డిసెంబర్ 15 తరువాత 10 క్లాస్ విద్యార్థులెవరిని ఎలాంటి ఇతర యాక్టివిటీస్ లో వినియోగించరాదు.
డిసెంబర్ 6 నుండి పదవ తరగతి వారికి, డిసెంబర్ 8 నుండి 1-5 తరగతుల వారికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు పరచాలి.
10 వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ ఎగ్జామ్ నిర్వహించి మార్కులు అప్లోడ్ చేయాలి.
FLN సర్వే సందర్భంగా ఉన్నది ఉన్నట్లు సర్వే నిర్వహించాలి.
MEGA PTM సందర్భంగా ప్రతి విద్యార్థికి అసెస్మెంట్ బుక్ లెట్, HPC కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి.
స్టడీ హౌర్ టైం లో ప్రతి విద్యార్థి హాజరయ్యేటట్లు ప్రధానోపాధ్యాయులు కృషిచేయాలి.
కలెక్టర్ లు నేరుగా ఉన్నత పాఠశాలలను విజిట్ చేసే విధంగా, దత్తత తీసుకునే విధంగా సూచనలు చేయడం జరుగుతుంది.
SUBJECT వారీ విద్యార్థుల యావరేజ్ మార్క్ ఆధారంగా ఆ SUBJECT టీచర్ గ్రేడ్ కూడా నిర్ణయించడం జరుగుతుంది.
యాక్షన్ ప్లాన్ టైం లో ప్రతి రోజూ నిర్వహించే స్లిప్ TEST ఆన్సర్ స్క్రిప్ట్ లు ఎగ్జామ్స్ పూర్తి అయ్యే వరకు ప్రధానోపాధ్యాయులు భద్రపరచాలి.