*సీనియారిటీ జాబితాల పరిశీలన తప్పనిసరి*
సాధారణ పరిపాలన శాఖ (GAD) మార్గదర్శకాల మేరకు EHRMS/TIS డేటా ఆధారంగా రూపొందించిన జనరల్ సీనియారిటీ జాబితాలు తుది (Final) జాబితాలుగా పరిగణించబడుతున్నాయి.
✓ ప్రతి ఉపాధ్యాయుడు తన పేరు, ఉద్యోగ వివరాలు, కేడర్ మరియు ఇతర సమాచారం జాబితాలో సరిగ్గా నమోదై ఉన్నాయో లేదో వెంటనే పరిశీలించాలి.
✓ ఏదైనా ఉపాధ్యాయుని పేరు జాబితాలో లేకపోయినా, వివరాలు తప్పుగా ఉన్నా వెంటనే సంబంధిత *IT Cell* కు సమాచారం అందించాలి.
ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సీనియారిటీ, సర్వీస్ రికార్డులు, వేతనాల చెల్లింపులు మరియు ఇతర పరిపాలనా అంశాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడు జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన సవరణలు ఉంటే వెంటనే తెలియజేయండి.
*“ఈరోజు చేసిన చిన్న పరిశీలన, రేపటి పెద్ద సమస్యలను నివారిస్తుంది.”*