*🎯కొత్త జిల్లాలు -టీచర్స్ కేటాయింపు* అంశం పై అవగాహన కొరకు, చిన్న వివరణ
🌹 విద్యార్థుల సంఖ్య ఆధారంగా జూన్ నెలాఖరు నాటికి ఉపాధ్యాయ పోస్టులు ఉమ్మడి జిల్లా నుండి విడిపోయిన జిల్లాలకు కేటాయిస్తారు
🌹GO. no-45, date: 20/4/2026 ప్రకారం 27 నెలల లోపు ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు
🌹పోస్టులను జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ పోస్టులుగా 3 విభాగాలుగా విభజన చేస్తారు
🌹SGT పోస్టులు SA పోస్టులు Gr-2 HM పోస్ట్లు జిల్లా స్థాయి పరిధిలోనే ఉంటాయి
🌹 రోస్టర్ పాయింట్లు ప్రకారం BC లకు, SCలకు, STలకు PHC ల వారిగా పోస్ట్లు కేటాయిస్తారు
🌹 ఉమ్మడి జిల్లా అనేది లోకల్ పరిధిలోనే ఉంటుంది .లోకల్లో 95% నాన్ లోకల్ 5% పోస్టులని విభజన చేస్తారు
🌹పోస్టుల విభజనకు సంబంధించిన ఫైలు GAD కి వెళ్ళినది
🌹 ఉమ్మడి జిల్లా ఆధారంగానే సబ్జెక్టు వైజ్ గా సీనియార్టీని చూస్తారు
🌹ప్రతి టీచర్ కి ఆప్షన్ ఫారం ఇస్తారు .ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం option -1 ,2,3 పెట్టాలి
🌹 సీనియార్టీ ర్యాంక్ ఆధారంగానే ఉపాధ్యాయుల సర్దుబాటు జరుగుతుంది
🌹 ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ఉపాధ్యాయులకు ,
అలాగే 70% పైన PHC ఉన్న ఉపాధ్యాయులకు
మానసిక వైకల్యం ఉన్న చిల్డ్రన్స్ యొక్క తల్లిదండ్రులు ఐన ఉపాధ్యాయులకు
కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన టీచర్స్ కు
బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవారికి
కిడ్నీ మార్పిడి జరిగిన టీచర్స్ కు
న్యూరో సర్జరీ జరిగిన టీచర్స్ టాప్ ప్రయారిటీ ఇస్తారు
🌹 స్పౌజును పరిగణలోకి తీసుకోరు
🌹మొదట జిల్లాలకు అలాట్ అయినట్లు ఆర్డర్లు ఇస్తారు ఆ తరువాత అలాటైన జిల్లాలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేసులు కేటాయిస్తారు
🌹ఒక నెల తరువాత spouse ఉన్నటువంటి వారికి మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పిస్తారు
🌹 ప్రస్తుతం PS HM గా పనిచేస్తున్న SA లందరూ వారి సబ్జెక్టు క్యాడర్ సీనియారిటీ ప్రకారమే సర్దుబాటు జరుగుతుంది. వారిని PS HM పోస్టులలో కొనసాగనివ్వరు
🌹 ఈ సర్దుబాటు ప్రక్రియ అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రకారమే జరుగుతుంది
🌹 రోగస్తులైన తల్లిదండ్రులు ఉన్న టీచర్స్ కి ఈసారి ప్రయారిటీ లేదు
🌹దాదాపు ఈ విద్యా సంవత్సరంలో ప్రమోషన్లు ఉపాధ్యాయ బదిలీలు జరగవు జిల్లాల వారీగా సర్దుబాటు మాత్రమే జరుగుతుంది
🌹 610 జీవో ప్రకారం వచ్చిన ఉపాధ్యాయులకు సీనియారిటీ అలాగే కొనసాగుతుంది
🌹అంతర్ జిల్లా బదిలీలలో వచ్చిన వారికి సీనియార్టీ లో ఈ జిల్లాలో చేరిన నాటి నుంచి మాత్రమే లెక్కిస్తారు
🌹ప్రస్తుతం మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం జూన్ నెలలో మన పాఠశాల రోలును బాగా పెంచుకోవటమే.