👆
*ఉపాధ్యాయ సంఘాల తో డైరెక్టర్ గారు చర్చించిన ముఖ్యాంశాలు...*
👉 బదిలీ పొంది రిలీవ్ కానీ టీచర్స్: సింగిల్ టీచర్స్ ఉండుటచే పాఠశాలలకు ఇబ్బంది ఏర్పడుతుందని రిలీవ్ చేయలేదన్నారు.
(SA..353,Sgt.631).
జూన్ 12th లోపు సదరు ఖాళీలకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఏర్పాట్లు కి చర్యలు తీసుకుని వెంటనే రిలీవ్ చేయాలని దాని పై డైరెక్టర్ గారు ఒక ప్రకటన విడుదల చేయాలని కోరాము.
👉 ఎన్రోల్మెంట్ ఆన్లైన్ లో వస్తున్న సమస్యలు తొలగించాలని కోరాము
👉 SA తెలుగు,హిందీ పదోన్నతలకు అర్హత గల sgt&Lp ల సీనియారిటీ జాబితా ప్రిపేర్ చేయాలని సూచించాము(కోర్టు కేస్ వలన చేయలేదన్నారు)
👉 ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025 తో జిల్లాల పునర్విభజన ప్రకారం స్టాఫ్ డివిజన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం లో ఈ సంవత్సరం బదిలీలు,పదోన్నతులు ఉండకపోవచ్చు(అతి త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు)
👉 ప్రతి నెల ఉపాధ్యాయుల రెగ్యులర్ శాలరీ బిల్స్ సబ్మిషన్ లో ఏర్డుతున్న ఇబ్బందులను తొలగించాలని కొరాము.
👉 ఏప్రిల్ నెల శాలరీ కి RTI &USC లాంటి 6రకాల లింక్స్ అటాచ్ చేయడం తో ఇబ్బంది ఏర్పడిందని,ముఖ్యంగా కరెంట్ కనెక్షన్ usc వేరే డిపార్ట్మెంట్ తో మ్యాపింగ్ జరిగి బిల్ సబ్మిట్ కావడం లేదని,స్కూల్ ఎడ్యుకేషన్ DDOs (HM &MEOs) ఈ లింక్స్ పెట్టకుండా చూడాలని,DTA తో కూడా మాట్లాడాలని కోరాము.
👉 MTS జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు తొలగించాలని,MTS బదిలీలు వారి స్వంతమండలాలో పోస్టింగ్ వచ్చేటట్లు చూడాలని,వారి ర్యాంక్ ఆధారంగా స్కూల్స్ లో పనిచేస్తున్న వారికి స్టేషన్ పాయింట్స్ కేటాయించి బదిలీలు చేపట్టాలని కోరాము.
👉 ఉమ్మడి సర్వీస్ రూల్స్ పునరుద్దరణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, స్టే లేని గజెట్టెడ్ పోస్టులకు కామన్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని కోరాము.దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు కు కృషి చేయాలని కోరాము.
👉 సమ్మర్ వేకేషన్ లో ఏ మేనేజ్మెంట్ లో కూడా క్లాస్ లు పెట్టకూడదని తెలిపాము(మోడల్ స్కూల్స్ వగైరా...)
👉 స్కూల్ అసిస్టెoట్లు లాంగ్వేజ్ స్ ల అన్ని 70:30 ప్రాప్తినే పదోన్నతులు ఉండాలని, డీ వియేషన్ లేదని అందరూ చెప్పడం జరిగింది.
👉 మున్సిపాలిటీ, కార్పొరేషన్ లలో స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కేటాయించాలని తెలపగా డైరెక్టర్ గారు ఎక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారో వివరాలు తెలియజేయాలని తెలిపారు.
👉 సంఘాల తో మీటింగ్ కి ఒకటి లేదా రెండు రోజులు ముందు టేబుల్ అజెండా తెలపాలని కోరగా సానుకూలంగా స్పందించారు
👉 శ్రీకాళహస్తి పట్టణంలో అప్గ్రేడ్ up స్కూల్స్ కి అనుమతి ఇవ్వాలని కోరగా గతంలో వాటిని సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేశామని,ఇప్పుడు స్కూల్స్ రీ స్ట్రక్చర్ మార్చలేమన్న కారణంగా సదరు స్కూల్స్ అప్గ్రేడ్ చేయలేమన్నారు
👉 జిల్లేల,గోసపాడు మండలం,నంద్యాల జిల్లా up ని HS గా అప్గ్రేడ్ కి ఫైల్ చాలా కాలంగా cse లోనే ఉందని తెలుపగా ప్రాసెస్ చేస్తామని,75 స్ట్రెంత్ దాటిని ప్రతి స్కూల్ నీ అప్గ్రేడ్ చేసి HM &స్టాఫ్ ఇస్తామన్నారు
👉 ఇంకనూ ఉన్న1996, 1998 టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్ విషయమై సంబంధిత బాధిత టీచర్లు రెప్రజెంట్ చేస్తే పరిశీలిస్తామ్మన్నారు.
👉 ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో చేర్చిన పిల్లలు ఏప్రిల్ 30 నాటికి 5 సం లోపు ఉంటే యు - డైస్ లో సబ్మిట్ కావడం లేదని, ఆ టెక్నికల్ సమస్య పరిష్కారం చేయాలని కోరాం. పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
👉 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో నమోదు చేస్తుంటే వారు ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు అయినట్లు చూపుతోందని, అలాగే ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్ధిని ట్రాన్స్ఫర్ అవుట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న దానిపై ఎమ్.యి.ఓలకు సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరాము.
👉 ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై 15 రోజుల్లో నిర్ణయం చేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.
👉. హై స్కూల్ ప్లస్ టీచర్లను(1100 పోస్టులు అవసరం) కొనసాగించడానికి 32 కోట్లు అవసరమని ఆర్ధిక శాఖకు ప్రత్తిపాదన పెడతామన్నారు.