📢 టెట్ రిజల్ట్స్‌పై ముఖ్యమైన స్పష్టతలు
1️⃣ డెసిమల్ మార్కుల Round Upపై స్పష్టత:
ఇటీవల విడుదలైన టెట్ ఫలితాల్లో కొంతమంది అభ్యర్థులకు 89.5+, 74.5+, 59.5+ వంటి మార్కులు వచ్చిన నేపథ్యంలో వాటిని 90, 75, 60గా Round Up చేయాలనే అంశంపై టెట్ డైరెక్టర్ గారిని వివరణ కోరడం జరిగింది.
➡️ నార్మలైజేషన్ అనంతరం వచ్చిన డెసిమల్ మార్కులను Round Up చేయడం ఉండదని టెట్ డైరెక్టర్ గారు స్పష్టం చేశారు.
2️⃣ కమ్యూనిటీ వివరాల సవరణపై:
ఉద్యోగంలో చేరిన సమయంలో **OC (Muslim తదితరులు)**గా ఉండి, అనంతరం BC-Eగా కమ్యూనిటీ మార్పు జరిగిన సందర్భాలు లేదా పొరపాటున టెట్ హాల్‌టికెట్/రిజల్ట్‌లో ఒక కమ్యూనిటీకి బదులుగా మరో కమ్యూనిటీ నమోదు అయిన సందర్భాల్లో—
➡️ TISలోని వివరాలను ఆధారంగా, తగిన ఆధారాలు (Evidence) సమర్పించినట్లయితే అవసరమైన మార్పులను పరిశీలిస్తామని సంబంధిత అధికారి తెలిపారు.
📌 అభ్యర్థులు తమ TIS వివరాలు, టెట్ రిజల్ట్/హాల్‌టికెట్‌లోని కమ్యూనిటీ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలి.