ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ G.O.Ms.No.592, తేదీ 16-09-2026 ప్రకారం...
🏠 నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate)
2015లో తహశీల్దార్లు Residence Certificate జారీ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అప్పట్లో ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలను నివాసానికి ఆధారంగా ఉపయోగించాలని సూచించారు.
ఇప్పుడు ప్రజలకు ఉద్యోగం, విద్య, ఓటర్ల జాబితా Special Intensive Revision (SIR) తదితర అవసరాలకు Residence Certificate అవసరం అవుతున్నందున, పాత ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది.
తహశీల్దార్లు మళ్లీ Residence Certificate జారీ చేయాలి.
ప్రజలు తహశీల్దార్ కార్యాలయానికి ఏదైనా supporting document తో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి ఆధార పత్రం లేకపోయినా, స్థానిక విచారణ (Local Enquiry) ద్వారా నివాసాన్ని నిర్ధారించి తహశీల్దార్ సర్టిఫికెట్ జారీ చేయవచ్చు.