• Home/
  • /
  • ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు - RTE అడ్మిషన్ల నోటిఫికేషన్ 2026-27

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు - RTE అడ్మిషన్ల నోటిఫికేషన్ 2026-27

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు - RTE అడ్మిషన్ల నోటిఫికేషన్ 2026-27 
 
పేద విద్యార్థులకు కార్పొరేట్/ప్రైవేట్ పాఠశాలల్లో 25% రిజర్వేషన్ కింద ఒకటో తరగతి (1st Standard) ఉచిత ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
 
@ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 20 నుంచి
చివరి తేదీ: మార్చి 10 వరకు
మొదటి విడత ఎంపిక (సీట్ల కేటాయింపు): మార్చి 25
రెండో విడత ఎంపిక: ఏప్రిల్ 12
👶 వయస్సు అర్హత:
CBSE/ICSE/IB స్కూల్స్ కోసం: ఏప్రిల్ 2, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
స్టేట్ సిలబస్ స్కూల్స్ కోసం: జూన్ 2, 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
📝 దరఖాస్తు చేయడం ఎలా?
ఆన్‌లైన్ ద్వారా: http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ద్వారా: మీ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు లేదా మండల విద్యా వనరుల కేంద్రాల్లో (MRC) సంప్రదించవచ్చు.
📂 కావలసిన పత్రాలు:
తల్లిదండ్రుల ఆధార్ కార్డు / ఓటర్ ఐడి / రేషన్ కార్డు.
నివాస ధ్రువీకరణ పత్రం (కరెంట్ బిల్లు/అద్దె ఒప్పందం/ఉపాధి హామీ కార్డు ఏదైనా ఒకటి).
పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం (Birth Certificate).
📞 మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800 425 8599
 
-ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజి.నెం.6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ 
PAAP ఫోన్ నెంబర్లు: +91 63053 13558,+91 89191 26847,+91 91333 66449,+91 70131 53372 ,+91 91008 27229,+91 95055 16169,+91 94405 40412

📧 parentsassociationap@gmail.com