TENTH:ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు
AP:
టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.