• Home/
  • /
  • ముఖ్య గమనిక IMPORTANT NOTE FOR SSC NOMINAL ROLL CORRECTIONS

ముఖ్య గమనిక IMPORTANT NOTE FOR SSC NOMINAL ROLL CORRECTIONS

 *🅰️ ముఖ్య గమనిక 🅿️* 

 
SSC నామినల్ రోల్‌లో చేర్చబడి, ఇప్పటికే UDISE+ పోర్టల్‌లో పరీక్ష వివరాలు ఫైనలైజ్ అయిన అభ్యర్థుల వివరాలను సవరించుటకు UDISE+ పోర్టల్‌లో “Edit Option” ప్రారంభించ బడినది అని అన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియ జేయడమైనది.
 
ఈ సదుపాయం ద్వారా ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా ఆరు (6) సార్లు మాత్రమే వివరాల సవరణకు అవకాశం కల్పించ బడుతుంది.
 
*ఉదాహరణకు:*
ఒక అభ్యర్థి మొదటి Edit Option‌లో ఇప్పటికే మూడు (3) సవరణలు చేసినట్లయితే, తదుపరి Edit Options‌లో మిగిలిన మూడు (3) సార్లు మాత్రమే సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆరు (6) సార్లు సవరణల అవకాశాన్ని పూర్తిగా వినియోగించిన అనంతరం, ఎట్టి పరిస్థితుల్లోనూ మరల సవరణలు చేయుటకు అవకాశం ఉండదు.
 
కావున, ఈ సదుపాయాన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించ వలసిందిగా పాఠశాలలకు సూచించడ మైనది.
 
Correction / Edit Option ద్వారా క్రింది వివరాలను మాత్రమే సవరించ వచ్చు:
 
* తండ్రి పేరు
* తల్లి పేరు
* కులం (Caste)
* ఉపకులం (Sub-Caste) 
* ఫోటోగ్రాఫ్
* సంతకం (Signature)
* గుర్తింపు గుర్తులు (Identification Marks)
 
*గమనికలు:*
Subjects మరియు CWSN Categoryలో ఎటువంటి సవరణలు చేయరాదు.
ఈ అంశాలలో ఏవైనా మార్పులు చేసినట్లయితే, సంబంధిత ప్రధానోపాధ్యాయుడే పూర్తి బాధ్యత వహించ వలసి ఉంటుంది. అలాగే, Subjects మరియు CWSN Categoryలో చేసిన సవరణలు పరిగణనలోకి తీసుకో బడవు.
 
అభ్యర్థి పేరు (Name) మరియు జన్మ తేదీ (Date of Birth) సవరణలు Aadhaar‌ లో మాత్రమే చేయ వలసి ఉంటుంది (ఈ ఫీల్డ్స్‌కు సంబంధించిన Edit Option తరువాత ప్రారంభించ బడుతుంది).
 
Aadhaar‌లో సవరణ పూర్తైన తరువాత, 15 రోజుల అనంతరం ఆ వివరాలు UDISE+లో ప్రతిబింబిస్తాయి.
 
ఈ విషయమై, అందరు RJDSEలు, DEOలు, Dy. DEOలు మరియు ACGEs తమ పరిధిలోని అన్ని ప్రధానోపాధ్యాయులకు ఈ సమాచారం విస్తృతంగా తెలియజేసి, అవసరమైన సవరణలు చేయించ వలసిందిగా సూచించడ మైనది.
 
*ఇంకా తెలియ జేయునది ఏమనగా...*
UDISE+ పోర్టల్‌లో Edit Option ద్వారా చేసిన అన్ని సవరణలు స్వయంచాలకంగా BSE పోర్టల్‌లో కూడా ప్రతిబింబిస్తాయి.
 
*Edit Option కాలవ్యవధి:*
 07.02.2026 నుండి 12.02.2026 వరకు మాత్రమే
 
ధన్యవాదములు,
డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్,
ఆంధ్రప్రదేశ్